Pawan Kalyan: కొడుకు అకీరా నందన్‌తో పవన్.. రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ జంటంటే ఫ్యాన్స్‌కు చాలా ఇష్టం. ఇప్పటికీ వీరిద్దరు కలిసుంటే బాగుండేది అనుకునే వారు ఎందరో. కానీ విడాకుల తర్వాత వీరిద్దరు ఎవరి పర్సనల్ లైఫ్‌లో వారు బిజీ అయిపోయారు. మళ్లీ ఒకరి గురించి మరొకరు మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. అయితే ఇన్నాళ్ల తర్వాత రేణు, పవన్ ఒకే ఫోటోలో కనిపించడంతో సోషల్ మీడియా అంతా ఈ పిక్ వైరల్ అవుతోంది.
రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్య. వీరి విడాకుల తర్వాత ఈ ఇద్దరు పిల్లలు రేణు దేశాయ్‌తోనే ఉంటున్నారు. కానీ ఇప్పటికీ పవన్ వారసుడిగా అకీరా నందన్‌ను అనుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. దీనికి రేణు కూడా ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. అయితే తాజాగా పవన్, రేణు దేశాయ్‌తో, పిల్లలతో కలిసి దిగిన ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
అకీరా నందన్ ఇటీవల తన ప్లస్ 2ను పూర్తి చేసుకున్నాడు. తను చదువుకున్న ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. దీనికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అంతే కాకుండా ఫ్యామిలీతో ఓ ఫోటో కూడా దిగారు. ఈ ఫోటోను షేర్ చేసిన రేణు దేశాయ్.. అకీరా నందన్ పెద్దవాడు అయిపోయాడు అంటూ ఓ ఎమోషనల్ నోట్‌ను కూడా జతచేసింది.
This Pic Made My day @PawanKalyan 😍💓#AkiraNandan #RenuDesai #Aadya pic.twitter.com/IBXMtixwC3
— Bhimavaram PawanKalyan FC™ (@BhimavaramPKFC) May 23, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com