జానపద రచయిత, గాయకుడు పెంచల్ దాస్‌కి పవన్ సత్కారం

జానపద రచయిత, గాయకుడు పెంచల్ దాస్ మంగళవారం హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్‌ని కలిశారు. ఈ సందర్భంగా తెలుగు జానపదాలు, సీమ మాండలికంపై ఇరువురు మాట్లాడుకున్నారు. ఈ చర్చలో ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ కూడా పాల్గొన్నారు. రాయలసీమ ప్రాంత జానపదాలను, అక్కడి మాండలికాన్ని నేటి తరానికి.. పెంచల్ దాస్ చేరువ చేస్తున్న విధానం అభినందనీయం అన్నారు పవన్ కళ్యాణ్. అనంతరం పెంచల్ దాస్‌ను పవన్ కళ్యాణ్ సత్కరించారు.
రాయలసీమ జానపదాన్ని, సీమ మాండలికాన్ని పాట రూపంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు పెంచల్ దాన్. 'కృష్ణార్జున యుద్ధం' మూవీలో 'దారి చూడు దుమ్ము చూడు' అనే పాటతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు పెంచల్ దాస్. ఆ తరవాత త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన 'అరవింద సమేత' మూవీకి పనిచేశారు. ఈ మూవీ కోసం 'రెడ్డమ్మ తల్లి' అనే ఎమోషనల్ సాంగ్‌ను ఆయన రచించారు. తాజాగా 'శ్రీకారం' మూవీలో 'వస్తానంటివో పోతానంటివో' అనే పాటను రాసి ఆలపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com