వకీల్ సాబ్ వచ్చేశాడు!

వకీల్ సాబ్ వచ్చేశాడు!
Vakeel Saab Teaser : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకి పండగ గిఫ్ట్ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..

Vakeel Saab Teaser : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకి పండగ గిఫ్ట్ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. పవన్ రీఎంట్రీ మూవీగా వస్తున్న వకీల్ సాబ్ టీజర్ ను మేకర్స్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. టీజర్ లో పవన్ ని చాలా స్టైలిష్ గా చూపించారు. లాయర్ గా పవన్ లుక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. "కోర్టులో వాదించటమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు" అని పవన్ చెప్పే డైలాగ్ టీజర్ కి మోస్ట్ అట్రాక్షన్ గా నిలిచింది. హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ మూవీకి రీమేక్ గా వకీల్ సాబ్ వస్తోంది. అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను పవన్ కల్యాణ్ పోషించారు. ఈ సినిమాకి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.Tags

Read MoreRead Less
Next Story