Vakeel Saab Teaser : 'వకీల్ సాబ్' టీజర్ డేట్ ఫిక్స్!

Vakeel Saab Teaser :పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం 'వకీల్ సాబ్' .. హిందీలో సూపర్ హిట్ అయిన 'పింక్' మూవీని తెలుగులో వకీల్ సాబ్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే .. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బోణీ కపూర్, దిల్ రాజులు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇదిలావుండగా పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్.. సంక్రాంతి(జనవరి 14న) సందర్భంగా సాయంత్రం 06:03 గంటలకు వకీల్ సాబ్ చిత్ర టీజర్ ను తరిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్సు చేసారు.
ఇప్పటికే డిసెంబర్ 31న ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ ను వదిలి సినిమా పైన మంచి హైప్ తీసుకువచ్చారు మేకర్స్.. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి, నివేదా థామస్, అనన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్లో సినిమాని రిలీజ్ చేయనున్నారు. సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.
Get ready for the Most Awaited Powerstar @PawanKalyan's #VakeelSaabTEASER on Jan 14th at 6:03PM🔥
— Sri Venkateswara Creations (@SVC_official) January 7, 2021
Subscribe & Stay Tuned to https://t.co/UQErJiy5Jg#SriramVenu @shrutihaasan @i_nivethathomas @yoursanjali @AnanyaNagalla @SVC_official @BayViewProjOffl @BoneyKapoor @MusicThaman pic.twitter.com/PcQLnANl5D
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com