pawan kalyan : పవన్ వదులుకున్న అయిదు బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇవే..!

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హిట్ కొడితే ఎలా ఉంటుందో 'ఖుషి', 'జల్సా', 'గబ్బర్ సింగ్', 'అత్తారింటికి దారేది' వంటి సినిమాలు రుచి చూపించాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వలన పవన్‌కళ్యాణ్ కొన్ని సినిమాలను వదులుకున్నారు. అయితే ఈ సినిమాలు చేసిన హీరోలకి మాత్రం ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. నేడు పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం..!
♦ పవన్‌కళ్యాణ్ తో 'ఖుషి' చేసిన నిర్మాత ఎమ్ రత్నం.. ఆ తర్వాత పవన్‌తో ఓ సినిమా చేయాలనీ అనుకున్నారు. అమీషాపటేల్ హీరోయిన్‌గా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకొంది. అయితే ఏవో కారణాల వలన ఈ సినిమా నుంచి పవన్ తప్పుకున్నారు. ఆ తర్వాత అదే కథతో తరుణ్ హీరోగా, రిచా హీరోయిన్‌గా 'నువ్వేకావాలి' సినిమాగా వచ్చి మంచి ఘన విజయాన్ని అందుకుంది.
♦ పవన్‌కళ్యాణ్‌తో కలిసి బద్రి సినిమా చేసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన పూరి.. ఆ తర్వాత చేసిన.. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి సినిమాలు కూడా చేయలని అనుకున్నారు. కానీ పవన్ ఎందుకో చేయలేదు.. ఇందులో ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలు రవితేజని స్టార్‌ని చేస్తే... పోకిరి మహేష్ కెరీర్‌కి ది బెస్ట్ ఇచ్చింది.
♦ 'జల్సా', 'అత్తారింటికి దారేది' సినిమాలతో సూపర్ కాంబినేషన్ అని అనిపించుకున్నారు పవన్, త్రివిక్రమ్.. వీరి కాంబినేషన్‌లో రావాల్సిన ఫస్ట్ సినిమా అతడు. ఈ కథను ముందుగా పవన్‌కి వినిపించారు త్రివిక్రమ్.. ఆ సమయంలో పవన్ నిద్రపోవడంతో కథ నచ్చలేదనుకోని త్రివిక్రమ్ వెళ్లిపోయారట. ఇదే కథతో మహేష్‌బాబుతో తీశారు త్రివిక్రమ్.
♦ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ముందుగా చిన్నోడి పాత్రకి పవన్‌కళ్యాణ్‌ని అనుకున్నారు మేకర్స్.. కానీ పవన్ రిజెక్ట్ చేయడంతో ఆ చిత్రం మహేశ్‌ను చేరింది. ఈ సినిమా ప్రేక్షకులను బాగా అలరించింది.
♦ పవన్‌కళ్యాణ్‌కి గబ్బర్‌సింగ్ రూపంలో బ్లాక్‌బస్టర్ మూవీని అందించిన హరీష్‌శంకర్ ముందుగా మిరపకాయ్ సినిమాని పవన్ తోనే చేయలని అనుకున్నారు. కథ కూడా వినిపించారు. కానీ ఎందుకో పవన్ చేయలేకపోయారు.
ఒకవేళ పవన్ కనుక ఈ సినిమాలు చేసుంటే ఆయన స్టామినా ఇంకోలా ఉండేది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com