Pawan Kalyan: ప్రసంగంలో 'కార్తికేయ 2'పై పవన్ కళ్యాణ్ కామెంట్స్..

Pawan Kalyan: ప్రసంగంలో కార్తికేయ 2పై పవన్ కళ్యాణ్ కామెంట్స్..
Pawan Kalyan: ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ టూర్‌లో బిజీగా ఉన్నారు.

Pawan Kalyan: కొన్ని సినిమాలు తక్కువ అంచనాలతో విడుదలయినా కూడా.. ఒక్కసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత బ్లాక్‌బస్టర్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి తోవకు చెందిందే 'కార్తికేయ 2' కూడా. కార్తికేయ సినిమా నిఖిల్ కెరీర్‌లోని బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటి. ఇక దానికి సీక్వెల్ అనగానే ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్నంటాయి. దానికి తగినట్టుగానే అదిరిపోయే ఔట్‌పుట్ ఇచ్చి సూపర్ హిట్ కొట్టాడు దర్శకుడు చందూ మొండేటి.

కార్తికేయ 2 షూటింగ్ దగ్గర నుండి విడుదల వరకు ఎన్నోసార్లు పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. దీంతో ప్రేక్షకుల అంచనాలు కూడా తగ్గుతూ వచ్చాయి. ప్రమోషన్స్ ఎలా జరిగినా కూడా కేవలం మౌత్ టాక్‌తో కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ అయ్యింది. కేవలం తెలుగులోనే కాదు.. విడుదలయిన ప్రతీ భాషలో ఈ మూవీ సూపర్ హిట్. ఇక ఈ సినిమా తాజాగా పవన్ కళ్యాణ్ కంటపడింది.

ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ టూర్‌లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఓ ప్రసంగంలో 'కార్తికేయ 2' గురించి ప్రస్తావించారు పవన్. నిఖిల్‌ అనే హీరో కార్తికేయ మూవీ వచ్చి దేశమంతా దుమ్ము దులిపేస్తోందని అన్నారు పవన్. తాను మార్పు రావాలని కోరుకుంటానని.. మార్పంటే ఇదేనని తెలిపారు. ఈ వీడియో నిఖిల్ కంటపడగా దీనిని తాను ట్వీట్ చేశాడు. 'ఆయన మాటల్లో సినిమా గురించి, నా గురించి వినడం సంతోషం' అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టాడు నిఖిల్.


Tags

Next Story