అతని కులం అడిగితే అమ్మనాన్నలను పెళ్ళికి రావొద్దన్నా : పవన్ కళ్యాణ్ చెల్లెలు

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలిప్రేమ చిత్రం ఎంత పెద్ద హిట్టైందో అందరికీ తెలిసిందే.. ఈ సినిమాలో పవన్ చెల్లలుగా నటించింది వాసుకి.. ఆ పాత్రలో వాసుకి అదరగొట్టిందనే చెప్పాలి. ఇక ఇదే సినిమాకి పవన్ కళ్యాణ్ ఫ్రెండ్.. ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. అయితే సినిమా షూటింగ్ సమయంలో వాసుకికి... ఆనంద్ సాయితో ఏర్పడిన పరిచయం, ప్రేమకి దారి తీసింది. అలా ఇద్దరు కొన్ని రోజుల తరవాత ఒక్కటయ్యారు. అయితే వీరికి ప్రేమకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది ఈ జంట.
తొలిప్రేమ సినిమా షూటింగ్ చివర్లో తమ ప్రేమకథ మొదలైందని ఆనంద్ సాయి చెప్పాడు.. ఆ టైంలో పవన్.. తనని, ఆనంద్ సాయికి పరిచయం చేస్తే.. సరిగా పట్టించుకోకుండా ఓ దయ్యంలాగా చూసి పారిపోయాడని వాసుకి చెప్పింది. ఇక తమ ప్రేమ గురించి ఇంట్లో చెబితే... అతని కులం, జాతకం ఏంటి? అది, ఇది అన్నారని, అప్పుడు తానూ మీరు ఇవన్నీ చూస్తే నా పెళ్లి చూడలేరు.. ఒకవేళ నా పెళ్లి చూడాలి అనుకుంటే అతని కులం, జాతకం లాంటివి చూడొద్దని చాలా రెబల్‌గానే చెప్పానని చెప్పుకొచ్చింది వాసుకి.
ఇక తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు ఆనంద్ సాయి.. పవన్ కళ్యాణ్‌తో కలసి తానూ హిమాలయాలకి వెళ్ళిపోవాలని అనుకున్నట్టుగా వెల్లడించాడు.. ఇక చెన్నైలో ఇద్దరం కలిసి చదువుకున్న రోజుల్లో తన దగ్గర డబ్బులు లేకపోతే పవన్.. పెట్రోల్ పోయించేవాడని, తానూ బైక్ నడిపేవాడినని అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఇక తనలో ఓ ఆర్ట్ డైరెక్టర్ ఉన్నాడని మొదటగా గుర్తించి ప్రోత్సహించింది కళ్యాణే అని.. అందుకే ఇప్పుడు తానూ ఈ పొజిషన్ లో ఉన్నట్టుగా ఆనంద్ వెల్లడించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com