వకీల్ సాబ్ ధియేటర్ లోకి వచ్చేది అప్పుడే!

వకీల్ సాబ్ ధియేటర్ లోకి వచ్చేది అప్పుడే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా వస్తున్న చిత్రం వకీల్ సాబ్... బాలీవుడ్ లో హిట్టైనా పింక్ మూవీ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా వస్తున్న చిత్రం వకీల్ సాబ్... బాలీవుడ్ లో హిట్టైనా పింక్ మూవీ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని బోనీ కపూర్, దిల్ రాజులు కలిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 09 న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ సినిమాలో పవన్ సరసన శ్రుతిహసన్ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి, అనన్య పాండే, నివేతా థామస్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్ సినిమా పైన మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.


Tags

Read MoreRead Less
Next Story