Pawan Kalyan: 'మేజర్' మూవీ గురించి పవన్ కళ్యాణ్ లేఖ.. స్పందించిన అడవి శేష్..

Pawan Kalyan: మేజర్ సినిమా ఎంతోమంది ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ రివ్యూలు అందుకుంది. ముంబాయి ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమాను హీరో అడవి శేష్ మన ముందుకు తీసుకొచ్చారు. తాజాగా ఈ సినిమా గురించి రాస్తూ పవన్ కళ్యాణ్ ఓ లేఖ విడుదల చేశారు.
మేజర్ సినిమా చూసిన ప్రతీ సెలబ్రిటీ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇప్పటికీ థియేటర్‌లలో మేజర్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా ఈ మూవీ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను ఇంకా సినిమా చూడకపోయినా త్వరలోనే చూస్తానని, ఇలాంటి ఓ బయోపిక్ చిత్రసీమ నుండి రావడం ఆనందం కలిగించిందన్నారు పవన్.
పవన్ కళ్యాణ్ రాసిన లేఖకు అడవి శేష్ స్పందించాడు. 'పవర్ స్టార్ మా హృదయం నిండిపోయింది. మీరు టూర్‌లో బిజీగా ఉండేసరికి మీకు మూవీ చూసే టైమ్ ఉంటుందా అనుకున్నాను. కానీ మీ పర్సనల్ నోట్ చాలా బాగా అనిపించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నాకు అన్నీ. ఆరోజు పంజా, ఈరోజు మేజర్. థాంక్యూ' అని ట్వీట్ చేశాడు అడవి శేష్.
.@PawanKalyan Dear Powerstar. My heart is full❤️ Meeru tour busy unde sariki meeku #Major choose time untundha ani Anukunna. Your warm personal note is truly touching. #MajorSandeepUnnikrishnan is everything to me. Aa roju #Panjaa Ee roju #Major, truly thankful for your grace 1/2 pic.twitter.com/BSxibWYgzM
— Adivi Sesh (@AdiviSesh) June 12, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com