Payal Rajput: ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు సపోర్ట్‌గా పాయల్.. విన్నర్ అవ్వాలంటూ పోస్ట్..

Payal Rajput: బిగ్ బాస్ అనే రియాలిటీ షో బుల్లితెరపై ఎంతో ఆదరణ సంపాదించిన తర్వాత మొదటిసారి ఓటీటీలో ప్రసారమయ్యింది. తెలుగులో బిగ్ బాస్ ఓటీటీకి కూడా మంచి ఆదరణే లభిస్తోంది. ఇక బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ఫస్ట్ సీజన్ అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ ఎవరో తెలియడానికి ఇంకా రెండు వారాలే గడువు ఉంది. ఈ సమయంలో బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో తన సపోర్ట్ ఎవరికో బయటపెట్టింది హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్.
ప్రస్తుతం బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌజ్‌లో బిందు మాధవి, అఖిల్, అరియానా, బాబా భాస్కర్ మాస్టర్, యాంకర్ శివ, మిత్రా శర్మ ఉన్నారు. ఇక శనివారం లోపు టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరూ అనేదానిపై క్లారిటీ కూడా వచ్చేస్తుంది. అయితే ఇదే సమయంలో బయట ఉన్న ఫ్యాన్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్స్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. తాజాగా నటి పాయల్ రాజ్‌పుత్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తన ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో బయటపెట్టేసింది.
ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ఓ అమ్మాయి ట్రాఫీ గెలవలేదు. అయితే బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో ట్రాఫీ గెలుచుకునే రేసులో ముందంజలో ఉంది బిందు మాధవి. తన ఆటతీరుతో పాటు బిందు మాధవికి సంబంధించిన ఎన్నో అంశాలు ప్రేక్షకులను ఫిదా చేసేస్తున్నాయి. అందుకే టాప్ 5లో బిందు ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. పాయల్ కూడా 'నువ్వు విన్నర్ అవ్వడానికి అర్హురాలివి' అంటూ బిందుకు సపోర్ట్‌గా ఇన్‌స్టాలో స్టోరీ షేర్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com