Uma Maheshwari: ఉమామహేశ్వరికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి..

Uma Maheshwari: కంఠమనేని ఉమామహేశ్వరి మృతి.. నందమూరి ఫ్యామిలీలో తీరని విషాధాన్ని నింపింది. ఎన్టీఆర్ చిన్న కుమార్తె హఠాన్మరణంతో ఆ ఫ్యామిలీ కోలుకోలేకపోతోంది. సోదరి మరణాన్ని ముగ్గురు అక్కాచెల్లెళ్లు భరలించలేకపోతున్నారు. ఇటు నందమూరి బాలకృష్ణ.. సోదరి మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఉమామహేశ్వరి మారణవార్త వినగానే బాలకృష్ణ హుటాహుటిన ఆమె ఇంటికి చేరుకున్నారు.
పోస్టుమార్టం నుంచి మిగితా వ్యవహారాలన్నింటిని బాలయ్య దగ్గరుండి చూసుకుంటున్నారు. ఉమామహేశ్వరికి నివాళులు అర్పించేందుకు నందమూరి ఫ్యామిలీ, సినీ, రాజకీయ ప్రముఖులు జూబ్లీహిల్స్ లోని ఆమె ఇంటికి తరలివస్తున్నారు. చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి, దుగ్గుబాటి పురందేశ్వరి, దుగ్గుబాటి వెంకటేశ్వరరావు, గారపాటి లోకేశ్వరి, నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, బాలకృష్ణ సతీమణి వసుంధర, నందమూరి కల్యాణ్‌రామ్, నారా లోకేష్, తదితరులు ఆమెకు నివాళులర్పించారు.
తెలంగాణమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీఎంపీ వేణుగోపాలాచారి .. ఉమామహేశ్వరి భౌతికకాయం వద్ద నివాళులర్పించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎన్టీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. ఎన్టీఆర్ అంటే తమకు అభిమానమని.. ఆయన కుమార్తె మరణం బాధాకరమన్నారు.
ఉమామహేశ్వరి మృతిపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారని ఎర్రబెల్లి చెప్పారు. ఉమామహేశ్వరి కూతురు అల్లుడు విదేశాల్లో ఉంటున్నారు. వారి ఇవాళ రాత్రివరకు హైదరాబాద్‌కు రానున్నారు. ఇక రేపు ఫిలింనగర్ మహాప్రస్థానంలో ఉమామహేశ్వరి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com