Ponniyin Selvan 2: ఏప్రిల్ లో మణిరత్నం మ్యాజిక్ రిపీట్

Ponniyin Selvan 2: ఏప్రిల్ లో మణిరత్నం మ్యాజిక్ రిపీట్
పొన్నియన్ సెల్వన్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్; వేయికళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులు

గతేడాది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన మణిరత్నం విజువల్ వండర్ 'పొన్నియన్ సెల్వన్' ప్రేక్షకులకు ఓ అద్బుతమైన అనుభూతిని కలిగించింది. మొదటిభాగం చూసిన వారు రెండవ భాగం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అనడంలో సందేహమే లేదు. వారికోసమే అన్నట్లు మరీ ఎక్కువ సమయం తీసుకోకుండా చిత్ర బృందం రెండవ భాగం రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసేసింది. అదేంటి ఇంతలోనే రెండవ భాగం షూటింగ్ పూర్తైపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరిగిపోయాయా అని మరీ ఆశ్చర్యపోకండి. నిజానికి మొదటి భాగంతో పాటే రెండొవ భాగం షూటింగ్ కూడా పూరైపోయందట. ఇప్పుడు రెండవ భాగం పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తవ్వడంతో రిలీజ్ కు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఏప్రిల్ 28న 'పొన్నియన్ సెల్వన్ 2' ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఐమాక్స్ థియేటర్లలో సినిమా విడుదలవుతుందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ దృశ్యకావ్యం రాజరాజచోళుడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలసిందే. కల్కీ కృష్ణమూర్తి నవలకు దృశ్యరూపం ఇచ్చిన మణిరత్నం ప్రేక్షకులకు అర్ధమయ్యేరీతిలో, ప్రతీ ఫ్రేమునూ ఎంతో ప్రేమతో తెరకెక్కించారు. ఐశ్వర్యారాయ్, జయంరవి, త్రిష, విక్రమ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బహుబాషల్లో విడుదలవ్వబోతోంది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సారధ్యంలో మణిరత్నం మరోసారి బ్యాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ ను రీ క్రియేట్ చేస్తారేమో చూాడాలి.

Tags

Read MoreRead Less
Next Story