Ponniyin Selvan 1 : టీజర్‌లో యాక్షన్ సీన్స్.. నందినిగా ఐశ్వర్య హైలెట్

Ponniyin Selvan 1 : మెస్మరైసింగ్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ సినిమా టీజర్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. అయితే సాయంత్రం 6గంటలకు టీజర్ రిలీజ్ కావడానికి కొన్ని నిమిషాల ముందే సోషల్ మీడియాలో లీక్ అయింది. దీంతో అఫిషియల్ టీజర్ రిలీజ్‌కు ముందే యూట్యూబుల్లో రివ్యూలు వచ్చేశాయి.
రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. దాదాపు 5 సంవత్సరాలు దర్శకుడు ఈ సినిమా కోసం కలలుకని కష్టపడ్డాడు. మొత్తం ఐదు భాషల్లో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. తెలుగు టీజర్‌ను మహేశ్‌బాబు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా లాంచ్ చేశారు.
టీజర్‌లో వెయ్యేళ్ల ముందటి పరిస్థితులను రాజ్యాలను కళ్లకు కట్టారు మణిరత్నం. మొత్తం టీజర్‌లో నందిని పాత్రలో ఐశ్వర్యరాయ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ప్రధాన పాత్రలన్నింటినీ 80 సెకన్లలో చూపించారు. సముద్రం మార్గాన యుధ్దానికి దిగే సీన్లు, చియాన్ విక్రం జండా ఎగిరేసే షాట్ అద్భుతంగా వచ్చాయి. టీజరే ఇలా ఉంటే ఇక ట్రైలర్ కిక్ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. సుమారు 500 కోట్ల రూపాయలతో ఈ మూవీని తెరకెక్కించారు. ఇది కేవలం మొదటి పార్ట్ మాత్రమే. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది.
From one of my favourite directors... #ManiRatnam sir! Thrilled to launch the Telugu teaser of #PonniyinSelvan1. Really looking forward to the film!https://t.co/Vepx93uY1z
— Mahesh Babu (@urstrulyMahesh) July 8, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com