Pooja Hegde: నెలరోజుల పాటు అన్నింటికీ దూరంగా పూజా హెగ్డే.. ఇన్‌స్టాలో పోస్ట్..

Pooja Hegde: నెలరోజుల పాటు అన్నింటికీ దూరంగా పూజా హెగ్డే.. ఇన్‌స్టాలో పోస్ట్..
Pooja Hegde: పాన్ ఇండియా ట్యాగ్‌తో విడుదలయిన చిత్రాలు పూజా హెగ్డేను నిరాశపరిచాయి.

Pooja Hegde: ఫామ్‌లో ఉన్న నటీనటులు వెంటవెంటనే సినిమా షూటింగ్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. బ్రేక్ లేకుండా కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలావరకు నటీనటులు వెంటవెంటనే సినిమాలు విడుదల చేయాలని అనే ఆలోచనతో షూటింగ్ సెట్స్‌లోనే గడిపేస్తున్నారు. అయితే వీటన్నింటికి దూరంగా ఉండాలని పూజా హెగ్డే ఓ నిర్ణయం తీసుకుంది. దాని గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ.. టాలీవుడ్‌లో ఇతర హీరోయిన్లకంటే ముందుగా తానే పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది పూజా హెగ్డే. కాకాపోతే పాన్ ఇండియా ట్యాగ్‌తో విడుదలయిన చిత్రాలు తనను నిరాశపరిచాయి. అయినా పూజాకు అవకాశాలు రావడం మాత్రం ఆగడం లేదు. ఇప్పటికీ తెలుగులో విజయ్‌తో, తమిళంలో సూర్యతో నటించే ఛాన్స్ కొట్టేసింది.

ఇక విరామం లేకుండా చాలాకాలంగా షూటింగ్స్‌లో పాల్గొంటున్న పూజా.. ఓ లాంగ్ బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. '1 నెల, 3 ఖండాలు, 4 సిటీలు. పదండి వెళ్దాం' అని ఎయిర్‌పోర్టులో ఓ ఫోటో దిగి దానికి క్యాప్షన్ పెట్టి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో తాను లాంగ్ బ్రేక్‌కు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఈ ట్రిప్‌లో కూడా అప్పుడప్పుడూ షూటింగ్స్‌లో పాల్గొన్నా కూడా ఎక్కువశాతం తన ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయాలనే ఆలోచనలో ఉందట పూజా.


Tags

Read MoreRead Less
Next Story