Poonam Bajwa: సింగిల్‌గా ఎందుకు ఉన్నారంటూ నెటిజన్ ప్రశ్న.. బాయ్‌ఫ్రెండ్‌తో ఫోటోతో షాకిచ్చిన నటి..

Poonam Bajwa: కొంతమంది నటీమణులు సినిమాలకు దూరమయినా కూడా సోషల్ మీడియా ద్వారా మాత్రం వారి ఫ్యాన్స్‌కు ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. ఫోటోషూట్స్ రూపంలో వారికి ఎప్పుడూ సర్‌ప్రైజ్‌లు ఇస్తూనే ఉంటారు. అందులో ఒకరే పూనమ్ బజ్వా. ఈ హీరోయిన్ సినిమాల గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా.. ఫోటోషూట్స్‌ను మాత్రం చాలామంది ఫాలో అవుతూనే ఉంటారు. తాజాగా ఈ హీరోయిన్ తన ఫ్యాన్స్‌కు ఊహించని షాకిచ్చింది.
తెలుగమ్మాయి అయిన పూనమ్ బజ్వా.. తెలుగు సినిమాలతోనే హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం.. ఇలా అన్ని భాషలను కవర్ చేసింది. చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది. ఇప్పటికీ అరాకొరా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది పూనమ్ బజ్వా.
తాజాగా సోషల్ మీడియాలో పూనమ్.. ఫ్యాన్స్‌కు ప్రశ్నలు వేయండి.. సమాధానం చేప్తాను అని ఆఫర్ ఇచ్చింది. దీంట్లో ఓ అభిమాని.. 'మీరు ఇంకా సింగిల్‌గా ఎందుకు ఉన్నారు' అని అడిగాడు. దానికి సమాధానంగా పూనమ్.. 'నేను సింగిల్ కాదు' అంటూ తన బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫోటోను షేర్ చేసింది. దీంతో చాలామంది నెటిజన్లు షాక్ అయ్యారు. ఇప్పటివరకు తన పర్సనల్ లైఫ్ గురించి, రిలేషన్‌షిప్ గురించి పెద్దగా బయటపెట్టని పూనమ్.. హఠాత్తుగా తన బాయ్‌ఫ్రెండ్ ఫోటోను రివీల్ చేయడం అందరికీ షాకిచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com