టాలీవుడ్

Poorna: పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పనున్న మరో ముద్దుగుమ్మ..

Poorna: పలు తెలుగు సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది పూర్ణ అలియాస్ షమ్నా కాసిమ్.

Poorna: పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పనున్న మరో ముద్దుగుమ్మ..
X

Poorna: మామూలుగా హీరోయిన్ల కెరీర్ లైఫ్ చాలా తక్కువ సమయమే ఉంటుంది. ఎప్పటికప్పుడు యంగ్ హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుండడంతో.. సీనియర్ హీరోయిన్ల క్రేజ్ క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. కొందరు నటీమణులు అలా ఇండస్ట్రీకి దూరమయితే.. మరికొందరు మాత్రం పెళ్లి తర్వాత గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉండాలని డిసైడ్ అవుతారు. తాజాగా మరో హీరోయిన్ కూడా అలాంటి ఒక నిర్ణయమే తీసుకున్నట్టు తెలుస్తోంది.

పలు తెలుగు సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది పూర్ణ అలియాస్ షమ్నా కాసిమ్. ఇక సినిమాలకంటే తాను బుల్లితెర షోల ద్వారానే ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఓ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరించడంతో పూర్ణ.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. దీని ద్వారా తనను వెతుక్కుంటూ మళ్లీ సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. అదే సమయంలో వ్యాపారవేత్త షానిద్‌ అసిఫ్‌ అలీతో పూర్ణ ఎంగేజ్‌మెంట్ జరిగింది.

తాను నవంబర్ 6న పెళ్లి చేసుకోనున్నట్టు పూర్ణ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అంతే కాకుండా తనది లవ్ మ్యారేజ్ కాదని.. పెద్దలు కుదిర్చిన పెళ్లి అని క్లారిటీ ఇచ్చింది. పైగా తను పెళ్లి తర్వాత దుబాయ్‌కు వెళ్లి సెటిల్ అవ్వబోతున్నట్టు తెలిపింది. దీంతో పూర్ణ.. ఇక సినిమాలకు, షోలకు దూరం కానుందని స్పష్టమవుతోంది. కానీ ప్రస్తుతం పూర్ణ పలు సినిమాలతో బిజీగా ఉంది.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES