Dasara Movie: నాని 'దసరా' కోసం పవర్‌ఫుల్ లేడీ విలన్..

Dasara Movie: మామూలుగా బుల్లితెరపైనే లేడీ విలన్స్ హవా కొనసాగుతుంది. అదే వెండితెర విషయానికి వచ్చేసరికి విలన్స్ అనేవాళ్లు మగవాళ్లే కనిపిస్తారు. అందులోనూ పరభాషా విలన్స్‌కు టాలీవుడ్‌లో క్రేజ్ ఎక్కువ. కానీ ఇప్పుడిప్పుడే ఈ పద్ధతి మారుతోంది. సినిమాల్లో కూడా లేడీ విలన్స్ అనేవారు ఉంటున్నారు. అందులోనూ వారి క్యారెక్టర్స్‌ను పవర్‌ఫుల్‌గా డిజైన్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా నాని సినిమా కోసం ఓ పవర్‌ఫుల్ లేడీ విలన్‌ను ఫైనల్ చేశాడట దర్శకుడు.
నేచురల్ స్టార్ అని పేరు తెచ్చుకున్న నాని.. పూర్తిగా కమర్షియల్ సినిమాలే కాకుండా అప్పుడప్పుడు ప్రయోగాత్మక చిత్రాలవైపు కూడా అడుగులేస్తున్నాడు. ఇక తన కెరీర్‌లో మొదటిసారి ఓ ఫుల్ లెన్త్ మాస్ క్యారెక్టర్ చేయడానికి నాని రెడీ అయ్యాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'దసరా' అనే సినిమాను చేస్తున్నాను నాని. ఈ సినిమా కోసం లుక్స్ దగ్గర నుండి పూర్తిగా మారిపోయాడు. ఇందులో నానికి జంటగా కీర్తి సురేశ్ నటిస్తోంది.
దసరా మూవీ బడ్జెట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అయితే ఇందులో విలన్‌గా ఇటీవల పూర్ణ ఫైనల్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన తర్వాత పూర్ణ బిగ్ స్క్రీన్‌పై పూర్తిగా కనుమరుగయిపోయింది. ఓ బుల్లితెర డ్యాన్స్ షోలో జడ్జిగా కనిపించిన తర్వాత పూర్ణకు మళ్లీ అవకాశాలు రావడం మొదలయ్యింది. ఇటీవల బాలయ్య నటించిన 'అఖండ'లో ఓ కీలక పాత్ర చేసిన పూర్ణ.. ఇప్పుడు దసరా కోసం విలన్ అవతారం ఎత్తనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com