పవన్ పై పోసాని కామెంట్స్.. ప్రెస్‌క్లబ్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు..!

పవన్ పై పోసాని కామెంట్స్.. ప్రెస్‌క్లబ్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు..!
ఏపీలో జనసేన-వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. టీడీపీ, వైసీపీకి మించి జనసేన వైసీపీ మధ్య వార్ నడుస్తోంది.

ఏపీలో జనసేన-వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. టీడీపీ, వైసీపీకి మించి జనసేన వైసీపీ మధ్య వార్ నడుస్తోంది. ఇటు మంత్రులు, అధికార పార్టీ నేతలు.. అటు పవన్ కళ్యాణ్, ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు ఎవరికి వారు తగ్గేదేలేదంటున్నారు. జగన్ సర్కారుకు పవన్ కౌంటర్లు ఇస్తుంటే.. జనసేనానిపై జగన్‌సేన చేస్తున్న ప్రతికౌంటర్లు కాక పుట్టిస్తున్నాయి. రిపబ్లిక్ ప్రీరిలీజ్ వేడుకలో మొదలైన మాటల తూటాలు.. వయా ట్విట్టర్ వేదికగా మారి ప్రకంపనలు రేపుతున్నాయి. మధ్యలో పోసాని కృష్ణ మురళి ఎంట్రీతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.

ఇక పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా పోసాని కృష్ణమురళి చేసిన ఆరోపణలు రచ్చ అవుతోంది. సోమవారం పవన్‌పై తీవ్ర విమర్శలు చేసిన పోసాని.. మంగళవారం కూడా ప్రెస్‌క్లబ్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. తన భార్య, కుటుంబంపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొందరు అనుచితమైన కామెంట్లు చేస్తూ మెసేజ్‌లు పెడుతున్నారని పోసాని మండిపడ్డారు. తనను డిమోరలైజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ పవన్‌పై పరుషపదజాలంతో విరుచుకుపడ్డారు.

ఇక పవన్ కళ్యాణ్‌పై పోసాని తీవ్రమైన విమర్శలు చేయడాన్ని జీర్ణించుకోలేని పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆయన ప్రెస్‌క్లబ్‌కు చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని పలువురు పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన పోసానికి బుద్ధి చెబుతామని పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story