Powerstar: సన్నిహితులకు పవర్ స్టార్ క్రిక్మస్ గిఫ్ట్ ! ఇవీ ప్రత్యేకం...

Powerstar: సన్నిహితులకు పవర్ స్టార్ క్రిక్మస్ గిఫ్ట్ ! ఇవీ ప్రత్యేకం...
క్రిస్మస్ గిఫ్ట్స్ తో ఫ్రెండ్స్ ను సప్రైజ్ చేస్తున్న పవర్ స్టార్. ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతున్న సన్నిహితులు

Powerstar: సన్నిహితులకు పవర్ స్టార్ క్రిక్మస్ గిఫ్ట్ ! ఇవీ ప్రత్యేకం...


అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పండగలు వస్తే మాత్రం పక్కా ఫ్యామిలీ మ్యాన్ అయిపోతాడు అనడంలో సందేహమే లేదు. తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతి ఏడాది తన ఫామ్ హౌస్ లోని మామిడి తోటలో పండిన పండ్లను, టాలీవుడ్ లోని స్నేహితులకు, అభిమానించే వ్యక్తులకు పంపుతాడన్న సంగతి తెలిసిందే. తాజాగా క్రిస్మస్ పురస్కరించుకుని క్రిస్మస్ గిఫ్ట్స్ పంపడం షురూ చేశాడు పవర్ స్టార్.


గతంలో కూడా త్రివిక్రమ్, అలీ, నితిన్, వేణు శ్రీరామ్ లాంటి వారికి పవన్ కళ్యాణ్ బహుమతులు పంపారు. ఇక ఆదివారం క్రిస్మస్ సందర్భంగా ఇండస్ట్రీలో తనకు దగ్గరైన వారితో పాటు, తనతో కలిసి పని చేస్తోన్న దర్శకులకు కూడా ఈ క్రిస్మస్ గిఫ్ట్స్ ను అందిస్తున్నారట పవన్. ఇక ఈ బహుమతులపై అన్నా లెజెనోవా, పవన్ కళ్యాణ్ నుంచి ప్రేమతో అంటూ రాసి మరీ ఉండడం విశేషం.


ఇక వేసవి వస్తే చాలు తమ తోట లోని మామిడి పళ్ళని ప్యాక్ చేసి పంపించే కళ్యాణ్, వివాహానంతరం భార్య అన్నా తో కలిసి క్రిష్ట్మస్ కు కూడా కానుకలు పంపాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. మహేష్-నమ్రతలతో పాటు, తనతో పని చేసే డైరెక్టర్స్ కి బండ్ల గణేష్, నితిన్ లాంటి స్నేహితులకి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఈ కానుకలు పంపిస్తున్నాడట. తాజాగా పవన్ నుండి గిఫ్ట్ అందుకున్న వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఆనందంగా అభిమానులతో పంచుకున్నారు. ఏదేమైనా ప్రజెంట్ పవర్ స్టాన్ పవన్ కళ్యాణ్ క్రిస్మస్ గిఫ్ట్స్ ల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags

Read MoreRead Less
Next Story