Powerstar: రీ-రిలీజ్ కు రెడీ అవుతున్న ఖుషీ; అదే రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్

Powerstar: రీ-రిలీజ్ కు రెడీ అవుతున్న ఖుషీ; అదే రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్
తెలుగు నాట రీ-రిలీజ్ లకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే పలు పాత సినిమాలు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తూ ఆదరణ చూరగొంటున్నాయి. తాజాగా పవర్ స్టార్ సెన్సెషనల్ హిట్ ఖుషీ కూడా రీ-రిలీజ్ కు రెడీ అయిందట.
పవర్ కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి, ఎన్నో రికార్డులను బదలుకొట్టిందీ మూవీ. 2023 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 31న మళ్లీ విడుదల చేయబోతోన్నారు. లేటెస్ట్ 4Kక్వాలిటీకి అప్ గ్రేడ్ చేసి, డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగ్ తో విడుదల చెయ్యబోతున్నారు నిర్మాత ఎమ్ రత్నం. ఇందులో భాగంగానే విడుదలైన ట్రైలర్‌కు జనాలు బ్రహ్మరథం పట్టేస్తున్నారు.
మరోవైపు ఖుషీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ 26, 27 తారీఖుల్లో ప్రారంభించబోతున్నారు. ఇక ట్రైలర్ కే ఇంత హడావిడి చేసేస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్, థియేటర్లలో ఏ రేంజ్ లో సందడి చేస్తారో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com