PowerStar: పవర్‌స్టార్ తెరపై మెరిసి 27ఏళ్లు...

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్... తెలుగు రాష్ట్రాలల్లో పరిచయం అక్కరలేని పేరు. ఆ పేరుకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. నటుడిగా కంటే మంచి వ్యక్తిగా ఆయనకు ఉన్న స్టార్ డమ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. క్లాస్, మాస్ కలబోసిన కాంబినేషన్‌లో ఆయనకంటూ సపరేట్ మానియా ఉంది. ఆయన పేరుతో అభిమానులు ఓ ఇజాన్నే ఏర్పరుచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడైనప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని విశేష ఆదరాభిమానాలను సంపాదిించుకున్నారు. జనసైనికుడిగా జనాల గుండెల్లో గుడికట్టుకున్నాడు. అయితే పవన్ సినిమాల్లోకి అడుగు పెట్టి దాదాపు 27ఏళ్లు పూర్తవుతోంది. 1996లో అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తొలి సారిగా తెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్. దీంతో అభిమానులు ఈ విషయాన్ని పంచుకుంటూ పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు సినిమాల్లోనే కాకుండా ప్రజా జివితాల్లో మార్పు కోసం జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టి అందులో కూడా చురుగ్గా పాల్గొంటూ జనాల బాధలను తెలుసుకుంటూ తనదైన శైలిలో సేవ చేస్తూ వెళుతున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com