Powerstar: పవన్ కల్యాణ్, సుజీత్ కాంబోలో కొత్త సినిమా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రారంభం అయింది. పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ. పవన్ ఓ పక్క రాజకీయాలతో, ఇంకోపక్క సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అయినా సుజీత్, పవన్ ను కలవడం, కథను చెప్పి ఒప్పించడం, పోస్టర్ తో కన్ఫర్మ్ చేయడం ఫ్యాన్స్‌లో ఉత్సాహం పెంచింది. కాగా డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ లో పవన్ నిలబడిన నీడ గన్ పట్టడం.. " అతనిని ఓజి అని పిలుస్తారు" అని ట్యాగ్ లైన్ ఇవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి.
సోమవారం సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది సినిమా యూనిట్. అయితే అభిమానులు ఓ వైపు సంతోషిస్తూనే.. మరోవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఇంకా హరిహర వీరమల్లు పూర్తి కాలేదు ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ పూజా కార్యక్రమాలు జరుపుకొని ఎదురుచూస్తోంది. ఇక ఇప్పుడు ఈ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్తోంది అని చెప్తున్నారు కానీ షూటింగ్ అనుకున్న సమయానికి అవుతుందా..? అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ ఏమి ఉండవని తెలుస్తోంది. దీంతో త్వరగానే పవన్ సినిమాను పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com