టాలీవుడ్‌ హీరోయిన్‌కి చుక్కలు చూపించిన యాచకులు...!

టాలీవుడ్‌ హీరోయిన్‌కి చుక్కలు చూపించిన యాచకులు...!
డబ్బులు ఇచ్చినా వదలకపోవడం, చివరికి వాళ్లకి బ్రహ్మనందం క్షమాపణ చెప్పడం మొత్తం సినిమాకి హైలెట్ గా నిలిచింది.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.. ఈ సినిమాలో బ్రహ్మనందం, అలీకి, కొంతమంది యాచకులకి మధ్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. యాచకులు బ్రహ్మిని చుట్టుముట్టి బాబు.. బాబు అంటూ డబ్బుల కోసం వేధిస్తుంటారు. డబ్బులు ఇచ్చినా వదలకపోవడం, చివరికి వాళ్లకి బ్రహ్మనందం క్షమాపణ చెప్పడం మొత్తం సినిమాకి హైలెట్ గా నిలిచింది. ఇలాంటి సన్నివేశమే టాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్‌కు ఎదురైంది. ఎప్పటిలాగే జిమ్‌ సెంటర్‌కి వెళ్లి వచ్చిన ప్రగ్యా దగ్గరికి కొంతమంది పిల్లలు డబ్బులు అడుగుతూ కనిపించారు. దీనితో వారికి కాస్త డబ్బులు తీసి ఇచ్చి కారు దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించింది. అప్పుడే మరికొంతమంది యాచకులు వచ్చి డబ్బులు కావాలని ప్రగ్యాని తెగ విసిగించారు. దీనితో చేసేది ఏమీ లేకా ఆమె తన దగ్గరున్న డబ్బులన్ని వాళ్లకే ఇచ్చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story