Prakash Raj : ఆత్మ లేదు.. పరమాత్మ లేదు.. అలాంటి సంఘం పెట్టే ఉద్దేశం లేదు..!

Prakash Raj : ఆత్మ లేదు.. పరమాత్మ లేదు..  అలాంటి సంఘం పెట్టే ఉద్దేశం లేదు..!
Prakash Raj : మా ఎన్నికలు ముగిసినా సరే ఆ వివాదాలు మాత్రం సద్దుమణగలేదు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మందీ రాజీనామా చేశారు.

Prakash Raj : మా ఎన్నికలు ముగిసినా సరే ఆ వివాదాలు మాత్రం సద్దుమణగలేదు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మందీ రాజీనామా చేశారు. దీంతో.. ప్రకాశ్ రాజ్ ఆధ్వర్యంలో కొత్త అసోసియేషన్ పెట్టబోతున్నారా అన్న ప్రచారం జరిగింది. దానికి ఆత్మ అనే పేరును పరిశీలిస్తున్నారని కూడా ఫిలింనగర్ లో టాక్ నడిచింది. కానీ ఆ విషయంలో ప్రకాశ్ రాజ్ క్లారిటీ ఇచ్చేశారు

ఈ సమయంలో కొత్త సంఘం పెడితే.. విమర్శల పాలవ్వడం తప్ప జరిగేదేమీ ఉండదు. అందుకే మా కు ఎన్నికైన కొత్త సంఘం పనితీరును గమనిస్తూ.. లోపాలను ఎత్తి చూపుతూ, సమస్యలపై ప్రశ్నిస్తూ, సభ్యుల సంక్షేమానికి కృషి చేయడమే మంచిదని ప్రకాశ్ రాజ్ వర్గం భావించింది. అందుకే ఆత్మ, పరమాత్మ, ప్రేతాత్మలు లేవని.. కొత్త అసోసియేషన్ పెట్టే ప్రశ్నే లేదని, అలాంటి ఐడియాలు తమకు లేవని తేల్చేసింది.

కొత్త అసోసియేషన్ పై ప్రకాశ్ రాజ్ క్లారిటీ ఇవ్వడంతో ఆ ప్రశ్నలకు తెరపడింది. కానీ విష్ణు ప్యానల్ పరితీరుపై ప్రశ్నించినప్పుడల్లా వివాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ప్రకాశ్ రాజ్ ప్యానలే చెబుతోంది. అందుకే భయంతో కలిసి పనిచేయలేమనే తప్పుకుంది. మందు జరిగేది ఏమిటో ఊహించే రాజీనామా చేసినట్లు స్పష్టంగా చెప్పారు ప్రకాశ్ రాజ్.

ప్రతీ నెలా విష్ణును ప్రోగ్రెస్ రిపోర్ట్ అడుగుతామన్న ప్రకాశ్ రాజ్.. వాళ్లతో కలిసి పనిచేయలేమని మాత్రం చెప్పేశారు. ఇప్పుడు కొత్త అసోసియేషన్ పెట్టబోమని తేల్చేశారు కనుక.. ఇకపై ప్రకాశ్ రాజ్ ప్యానల్ పనితీరు ఎలా ఉంటుందన్నదే పెద్ద ప్రశ్న. బైలాస్ మార్చకపోతే.. రిజైన్ వెనక్కు తీసుకుంటామని చెప్పారు కనుక.. ఇక విష్ణు ప్యానల్ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story