Prakash Raj New Association : 'మా' కు పోటీగా ప్రకాష్ రాజ్ కొత్త అసోసియేషన్ ..!

Prakash Raj New Association : ఎంతో రసవత్తరంగా సాగిన మా ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. ఈ ఉత్కంఠ పోరులో ప్రకాష్ రాజ్ పైన మంచు విష్ణు విజయం సాధించారు. అయితే అంత అయిపొయింది అనుకున్న టైంలో వరుస రాజీనామాల పర్వంతో అసలు కథ ఇప్పుడే మొదలైంది. కళకి భాషాభేదం లేదని చెప్పుకునే సినీ పరిశ్రమలో ప్రాంతీయ వాదం తెరపైకి వచ్చింది.
నాన్ లోకల్ అంటూ విష్ణు ప్రచారం చేయడంతో మా తో తనకున్న 21 సంవత్సరాల బంధాన్ని వదులుకున్నారు ప్రకాష్ రాజ్.. మా ఎన్నికలు జాతీయ, ప్రాంతీయ వాదానికి మధ్య జరిగాయని ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ముందు మెగా బ్రదర్ నాగబాబు కూడా మా సభ్యత్వానికి రిజైన్ చేశారు. ఆ తర్వాత శివాజీరాజా రాజీనామా ఆరోపణలు చేశారు.
హీరో శ్రీకాంత్ కూడా రాజీనామా చేస్తారంటూ ప్రచారం నడిచింది. వీరితో పాటుగా ప్రకాష్ రాజ్ ప్యానల్ తరుపున పోటీ చేసిన వారందరూ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనితో మా లో అసలేం జరుగుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. తాజాగా ప్రకాష్ రాజ్‌తో సహ మరికొందరు మా అసోసియేషన్ కి పోటీగా మరో అసోసియేషన్ పెట్టనున్నట్టుగా తెలుస్తోంది. 'ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(ఆత్మా) పేరుతో కొత్త అసోసియేషన్ ఉండనుందని సమాచారం.
వీరిని బుజ్జగించేందుకు విష్ణు వర్గం ప్రయత్నిస్తోందని సమాచారం.. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో అందరూ రాజీనామా చేస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అటు ప్రకాష్ రాజ్ కి ఎలాంటి సపోర్ట్ ఇచ్చేందుకు సిద్దేమేనని నాగబాబు గతంలోనే చెప్పుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com