మా ప్యానల్‌లో గెలిచిన సభ్యులు అంతా రాజీనామా చేస్తున్నాం : ప్రకాష్ రాజ్

మా ప్యానల్‌లో గెలిచిన సభ్యులు అంతా రాజీనామా చేస్తున్నాం : ప్రకాష్ రాజ్
తమ ప్యానల్ నుంచి గెలిచిన అందరం రాజీనామా చేస్తారని ప్రకటించారు నటుడు ప్రకాష్ రాజ్... రాజీనామాని స్వీకరించాలని కోరారు.

తమ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు రాజీనామా చేస్తారని ప్రకటించారు నటుడు ప్రకాష్ రాజ్... ఈ రాజీనామాలని స్వీకరించాలని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణుని కోరారాయన.. మా ఎన్నికల్లో రౌడీయిజం జరిగిందని ఎక్కడెక్కడి నుంచో మనుషులను తీసుకొచ్చారని అన్నాడు. బెనర్జీ లాంటి సీనియర్ నటుడిపై చేయి చేసుకున్నారని అన్నారు. ఇక తొలి రోజు గెలిచినవాళ్లు.. ఆ తరువాతి రోజు ఎలా ఓడారని ఆశ్చర్యపోయామని, పోస్టల్ బ్యాలెట్ లో అన్యాయం జరిగిందని అన్నారు. రాబోయే రెండు ఏళ్ళు విష్ణు మా కోసం బాగా పనిచేయాలని కోరారు. భవిష్యత్తులో బయటివాళ్ళు పోటీ చేయకూడదని అనే నిబంధన తీసుకురాకపోతే మా సభ్యత్వానికి చేసిన రాజీనామాని వెనక్కి తీసుకుంటానని తెలిపారు ప్రకాష్ రాజ్.



Tags

Read MoreRead Less
Next Story