Maa Elections 2021 : 'మా'లో మరో మలుపు.. బయటివాళ్లు మా ఓటర్లను బెదిరించారు : ప్రకాష్ రాజ్ ఆరోపణ

క్రిమినల్ రికార్డు వున్న ఓ వైసీపీ నేతను వెంటబెట్టుకుని మోహన్‌బాబు, మంచు విష్ణు పోలింగ్ స్టేషన్‌లోకి వెళ్లారని.. అందుకు సంబంధించిన ఫొటోలను ఎన్నికల అధికారికి సమర్పించారు. జగన్, మోహన్‌బాబు, మంచు విష్ణుతో వైసీపీ నేత నూకల సాంబశివరావు దిగిన ఫోటోలను ఆధారాలుగా ఇచ్చారు. విష్ణు ప్యానెల్ బ్యాడ్జీలు పెట్టుకుని ఆ వైసీపీ నేత మా ఎన్నికల్లో పాల్గొన్నారని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు ప్రకాష్ రాజ్.
ప్రకాష్‌రాజ్ చెప్తున్న ఆ వైపీసీ నేత పేరు నూకల సాంబశివరావు. అతనిపై జగ్గయ్యపేటలో రౌడీషీట్ కూడా ఉంది. అతను ఓ హత్య కేసులో నిందితుడుగా కూడా ఉన్నాడు. అలాంటి వ్యక్తులు ఎన్నికల హాల్‌లోకి ఎందుకు వచ్చారు, విష్ణు ప్యానల్ బ్యాడ్జ్‌లు ఎందుకు పెట్టుకున్నారు అని ప్రకాష్‌రాజ్ ప్రశ్నిస్తున్నారు. ఓటర్లను బెదిరించారని తాము మొదట్నుంచి చెప్తూనే ఉన్నామని అంటున్నారు. రౌడీషీటర్లు చాలా మంది ఓటర్లను ప్రభావితం చేశారని, సీసీ ఫుటేజ్ మొత్తం చూస్తే అసలేం జరిగిందో ప్రజలకు తెలుస్తుందని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com