Pranitha Subhash: ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత.. సోషల్ మీడియాలో పోస్ట్ షేర్..
Pranitha Subhash: పవన్ కళ్యాణ్ చేసిన 'అత్తారింటికి దారేది'లో నటించి బాపు గారి బొమ్మగా పేరు తెచ్చుకుంది ప్రణీత సుభాష్. చేసింది తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్‌లో ఓ మార్క్‌ను క్రియేట్ చేసింది. గతేడాది మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకున్న ప్రణీత.. ఇటీవల ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలను తానే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ప్రణీత.. తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది. అంతే కాకుండా తన సీమంతం ఫోటోలు, బేబీ బంప్ ఫోటోలు కూడా షేర్ చేసింది. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. తాజాగా తన బేబీ గర్ల్ గురించి కూడా తానే స్వయంగా పోస్ట్ చేసి ఓ క్యాప్షన్ కూడా పెట్టింది.
'గత కొన్నిరోజులుగా, పాప పుట్టినప్పటి నుండి నాకు అంతా కలలాగా అనిపిస్తోంది. మా అమ్మ గైనకాలజిస్ట్ అవ్వడం అదృష్టంగా భావిస్తున్నా.. తనకు కూడా ఎమోషనల్‌గా ఇది చాలా కష్టమైన సమయం. నా బర్త్ స్టోరీ మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఎదురుచూస్తున్నాను.' అని క్యాప్షన్ పెట్టిన ప్రణీత.. తనకు వైద్యం చేసిన డాక్టర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com