పెళ్లిసందD : పూలు, పండ్లు లేకుండానే దర్శకేంద్రుడి రొమాంటిక్ పాట..!
ఈ చిత్రంలోని 'ప్రేమంటే ఏంటి' అనే మెలోడి పాటను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఈ పాటను చంద్రబోస్ రాయగా, హరిచరన్, శ్వేతా పండిట్ కలిసి ఆలపించారు.

ఫ్యామిలీ హీరో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ హీరోహీరోయిన్లుగా పాతికేళ్ళ క్రితం వచ్చిన చిత్రం పెళ్లి సందడి... అప్పట్లో మంచి ఘన విజయం సాధించిన ఈ చిత్రం పేరుతోనే ఇప్పుడు మరో చిత్రం తెరకెక్కుతుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని 'ప్రేమంటే ఏంటి' అనే మెలోడి పాటను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఈ పాటను చంద్రబోస్ రాయగా, హరిచరన్, శ్వేతా పండిట్ కలిసి ఆలపించారు.
అయితే ఈ మెలోడీ సాంగ్ లో కె.రాఘవేంద్రరావు మార్క్ అయిన పూలు, పండ్లు లాంటివి లేకుండా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో స్టైలిష్ గా ప్రజెంట్ చేశారు. ఈ పాటలో రోషన్ సరికొత్త లుక్ లో కనిపించగా, శ్రీలీల అందాలతో ఆకట్టుకుంది. మొత్తానికి ఈ పాట లవ్ బర్డ్స్ ని ఆకట్టుకునేలా ఉంది.
RELATED STORIES
Chandrababu: అల్లూరి 125వ జయంతి.. ఆయన సేవలను మరోసారి గుర్తుచేసుకున్న...
4 July 2022 11:30 AM GMTBhimavaram: అల్లూరి విగ్రహావిష్కరణకు ఆహ్వానించిన అతిథులకు అవమానం..
4 July 2022 9:15 AM GMTBhimavaram: అల్లూరి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి.. 27 మందికి...
3 July 2022 3:55 PM GMTChandrababu: సీఐడీపై డీజీపీకి ఫిర్యాదు చేసిన చంద్రబాబు.. వీడియోలను...
3 July 2022 9:15 AM GMTPawan Kalyan: నా సిద్దాంతాల ఆధారంగానే పార్టీ ముందుకు వెళుతుంది- పవన్...
2 July 2022 2:21 PM GMTYCP: వైసీపీ ప్లీనరీలో మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఖంగుతిన్న పార్టీ...
1 July 2022 3:45 PM GMT