దర్శకేంద్రుడి 'పెళ్లిసందD' మొదలైంది..!

ఫ్యామిలీ హీరో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ హీరోహీరోయిన్లుగా పాతికేళ్ళ క్రితం వచ్చిన చిత్రం పెళ్లి సందడి... అప్పట్లో మంచి ఘన విజయం సాధించిన ఈ చిత్రం పేరుతోనే ఇప్పుడు మరో చిత్రం తెరకెక్కుతుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని మొదటి పాటను ఈ నెల 28న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఓ చిన్న లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ సినిమాలోని అన్నీ పాటలను చంద్రబోస్ రాశారు.
అయితే ఏప్రిల్ 28కి ఓ ప్రత్యేకత ఉంది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'అడవిరాముడు' ఇదే రోజున విడుదలై మంచి ఘనవిజయాన్ని అందుకుంది. అంతేకాకుండా ఆయన సమర్పణలో రూపొందిన 'బాహుబలి: ది కన్‌క్లూజన్' విడుదలైందీ కూడా ఇదే రోజు కావడం విశేషం.. అందుకే ఈ 'పెళ్లిసంద..డీ' పాటని ఆ రోజున విడుదల చేయాలని నిర్ణయించినట్టు సినీ వర్గాలు తెలిపాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com