Priya Anand: 'స్వామి నిత్యానందను పెళ్లి చేసుకోవాలని ఉంది'.. నటి సంచలన కామెంట్స్..

Priya Anand: కొన్నిసార్లు హీరోహీరోయిన్లు సరదాగా చెప్పిన మాటలు సంచలనాన్ని సృష్టిస్తుంటాయి. కొన్నిసార్లు అవే వారిని చిక్కుల్లో పడేస్తుంటాయి. తాజాగా ఓ హీరోయిన్ ఏకంగా స్వామి నిత్యానందనే పెళ్లి చేసుకోవాలని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనెవరో కాదు హీరోయిన్ ప్రియా ఆనంద్. ప్రస్తుతం తాను చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
'వామనన్' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమయిన ప్రియా ఆనంద్.. ఆ తర్వాత తెలుగులో కూడా పరిచయమయ్యింది. అంతే కాకుండా కెరీర్ ప్రారంభించిన తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడ కూడా తన మార్క్‌ను క్రియేట్ చేసింది ఈ భామ. ఇక చాలాకాలం తర్వాత 'మా నీళ్ల ట్యాంకు' అనే వెబ్ సిరీస్‌తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇదే సమయంలో నిద్యానందపై తాను ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ప్రియా ఆనంద్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండే వ్యక్తి కాదు. కానీ గతకొంతకాలంగా తాను స్వామి నిత్యానంద వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంది. ఇదే విషయంపై తనను ప్రశ్నించగా.. తనకు నిత్యానంద అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.
ఎన్నో విమర్శలు ఎదురైనప్పటికీ ఆయన వేలాదిమందిని ఆకట్టుకున్నారని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. కుదిరితే ఆయన్ని పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పి షాకిచ్చింది. ఒకవేళ ఆయనతో పెళ్లి జరిగితే తన పేరు కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదని, ఎందుకంటే ఇద్దరి పేర్లు కాస్త ఒకేలా ఉంటాయని చెప్పింది ప్రియా ఆనంద్. ఒక్కసారిగా తాను మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో సంచలనాన్ని సృష్టించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com