Priyamani: 'పుష్ప 2'లో ప్రియమణి.. ఆ హీరోకు భార్యగా..

Priyamani: ముందుగా నెగిటివ్ టాక్‌తో షోలు ప్రారంభమయినా.. ఆ తర్వాత పాన్ ఇండియా హిట్ కొట్టింది 'పుష్ప'. అందుకే పుష్ప 2పై చాలా ప్రెజర్ పడుతోంది. అందుకే ఇంతకు ముందు రాసుకున్న కథకు చాలా మార్పులు చేర్పులు చేసుకున్నాడు దర్శకుడు సుకుమార్. ఇక తాజాగా పుష్ప 2కు ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అవ్వడంతో ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇంతలోనే ఈ మూవీలో ప్రియమణి ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
ఎంతోమంది స్టార్ హీరోలతో నటించి ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుంది ప్రియమణి. ఇక 'నారప్ప' చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా ప్రారంభించింది. ఇప్పుడు సినిమాలతో పాటు ఓటీటీ కంటెంట్‌లో కూడా నటిస్తూ బిజీ అయిపోయింది. మళ్లీ ఫామ్‌లోకి రావడంతో సీనియర్ హీరోల సరసన ప్రియమణి నటిస్తే బాగుంటుందని చాలామంది మేకర్స్ అనుకుంటున్నట్టు సమాచారం.
ఇక పుష్ప 2లో పోలీస్ ఆఫీసర్‌గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఫాహద్ ఫాజిల్ కనిపించనున్న విషయం తెలిసిందే. తనతో పాటు విజయ్ సేతుపతి కూడా ఈ మూవీలో మరో విలన్‌గా నటిస్తున్నాడని ఇప్పటికే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే విజయ్ సేతుపతి భార్య పాత్రలో ప్రియమణి ఈ సినిమాలో మెరవనుందట. ఇక ఈ రోల్ చాలా ఢిఫరెంట్‌గా ఉండబోతుందని టాక్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com