Priyanka Jawalkar: బాయ్‌ఫ్రెండ్‌తో ప్రియాంక జవాల్కర్ ఫోటో..! క్లారిటీ ఇచ్చిన నటి..

Priyanka Jawalkar: ఈమధ్యకాలంలో సినీ పరిశ్రమలో ప్రేమ, పెళ్లి అంశాలు కామన్ అయిపోయాయి. ఇప్పటికీ చాలామంది సీనియర్ హీరోహీరోయిన్లు పెళ్లి చేసుకోకుండా ఉండగా.. మరికొందరు మాత్రం పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ మీద దృష్టి పెడుతున్నారు. తాజాగా యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ పెట్టిన పోస్ట్ కూడా తనకు ఎవరో బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు అనింపిచేలా చేశాయి. తాజాగా వీటిపై ప్రియాంక ఓ క్లారిటీ ఇచ్చింది.
ప్రియాంక జవాల్కర్, క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్.. కొన్నాళ్లు ఒకరి సోషల్ మీడియా పోస్టులకు మరొకరు కామెంట్లు చేసుకోవడం ఆసక్తికర విషయంగా మారింది. అయితే తాజాగా ప్రియాంక.. ఓ వ్యక్తితో ఫోటో దిగి 'అతడే' అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. కానీ ఆ వ్యక్తి ఎవరో మోహం కనిపించకుండా జాగ్రత్తపడింది. దీనికి నెటిజన్లు.. కచ్చితంగా ఆమె ప్రేమలో పడిదంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఈ వార్తలకు మరో పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చింది ప్రియాంక.
'నా ఎదురుగా కూర్చున్న వ్యక్తి.. ఆరోజు మాకు సహాయం చేయడం కోసం వచ్చాడు. మేము ఇంత పెద్ద వార్త అవ్వకపోయింటే సంతోషించేవాళ్లం. పైగా అమ్మ ఈ వార్తల గురించి అడుగుతోంది' అంటూ మరోసారి ఆ ఫోటో షేర్ చేసి ఈ క్యాప్షన్‌ను దానికి జతచేసింది ప్రియాంక. అయితే తన మాటలను ఇప్పటికీ కొందరు నెటిజన్లు నమ్మలేకపోతున్నారు. అసిస్టెంట్ అయితే 'అతడే' అని క్యాప్షన్ ఎందుకు పెట్టాలని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com