Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ఇంతకీ అతడు ఎవరు..?

Priyanka Jawalkar: ఈమధ్య హీరోహీరోయిన్లు తమ ప్రేమ విషయాన్ని కూడా చాలా క్రియేటివ్‌గా చెప్తున్నారు. ముందుగా సోషల్ మీడియాలో వారు ప్రేమలో ఉన్నట్టుగా అభిమానులకు హింట్ ఇస్తున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి వారు ప్రేమించిన వారు ఎవరో రివీల్ చేస్తున్నారు. ఇక వీరి దారిలోనే యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కూడా వెళ్తున్నట్టుగా అనిపిస్తోంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన 'ట్యాక్సీవాలా' చిత్రంతో ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయమయ్యింది ప్రియాంక జవాల్కర్. ఇక సత్యదేవ్, కిరణ్ అబ్బవరంలాంటి యంగ్ హీరోలతో నటించి బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుంది. ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉన్న ప్రియాంక.. ఎక్కువగా ఫోటోషూట్స్‌పై దృష్టిపెట్టింది. తాజాగా తను చేసిన ఓ పోస్ట్‌పై ఓ యంగ్ క్రికెటర్ కామెంట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
ప్రియాంక జవాల్కర్, క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్.. కొన్నాళ్లు ఒకరి సోషల్ మీడియా పోస్టులకు మరొకరు కామెంట్లు చేసుకోవడం ఆసక్తికర విషయంగా మారింది. అయితే తాజాగా ప్రియాంక.. ఓ వ్యక్తితో ఫోటో దిగి 'అతడే' అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. కానీ ఆ వ్యక్తి ఎవరో మోహం కనిపించకుండా జాగ్రత్తపడింది. దీనికి నెటిజన్లు.. అతడు వెంకటేశ్ అయ్యరే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ అతడు ఎవరో తెలియాలంటే ప్రియాంక మరో పోస్ట్ పెట్టేవరకు ఆగాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com