ధియేటర్లో దిల్‌రాజు హంగామా..

ధియేటర్లో దిల్‌రాజు హంగామా..
పవన్ కటౌట్‌కి పాలాభిషేకాలు చేస్తున్నారు. బాణా సంచా కాలుస్తూ, డ్యాన్సులు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు నగరంలోని శివ పార్వతి థియేటర్‌లో సినిమా చూసి ఫ్యాన్స్‌తో పాటు తానూ సందడి చేశారు. తెరపై పవన్ కనిపించడానే కాగితాలు విసిరి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో వకీల్ సాబ్ విడుదలవడంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు.

పవన్ కటౌట్‌కి పాలాభిషేకాలు చేస్తున్నారు. బాణా సంచా కాలుస్తూ, డ్యాన్సులు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా సూపర్‌గా ఉందని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు.

Tags

Read MoreRead Less
Next Story