'Azadi Ka Amrit Mahotsav: సినిమా విడుదల చేయలేక అనారోగ్యం పాలైన నిర్మాత

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పిలుపుతో ప్రేరణ పొంది దేశ స్వతంత్రం కోసం చిన్న వయసులో ప్రాణ త్యాగం చేసిన ఓ మహనీయుడి పై సినిమా తీసిన నిర్మాత సినిమాను విడుదల చేయలేక, ఆర్థిక భారాన్ని తట్టుకోలేక గుండెపోటుకు గురయ్యాడు.
స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు ఖుదీరామ్ బోస్. బయోపిక్స్ ట్రెండ్ అవుతోన్న నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని రూపొందించారు. గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించగా చాలా మంచి స్పందన వచ్చింది. 2022 డిసెంబర్ 22న ‘ఖుదీరామ్ బోస్’ చిత్రాన్ని గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులకు ప్రదర్శించారు.
అయితే సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తీసిన సినిమా విడుదలకు నోచుకోక, ఆర్థిక సమస్యల వత్తిడితో నిర్మాత గుండెపోటుకు గురయ్యాడు. చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పనిచేశారు. సంగీత దర్శకుడిగా మణిశర్మ, ప్రొడక్షన్ డిజైనర్‌గా నేషనల్ అవార్డ్ విన్నర్ తోట తరణి, స్టంట్ డైరెక్టర్‌గా కనల్ కన్నన్, సినిమాటోగ్రాఫర్‌గా రసూల్ ఎల్లోర్, ఎడిటర్‌గా మార్తాండ్ కె.వెంకటేష్ వర్క్ చేశారు.
ఖుదిరామ్ బోస్ గురించి ఈ జనరేషన్ కి తెలియకపోవటం; కమర్షియల్ సినిమాల మధ్య ఇలాంటి బయోపిక్ సినిమాలకు పరిశ్రమ నుంచి, ప్రేక్షకుల నుంచి ఆదరణ లేకపోవడం నిర్మాత ఈ దుస్థితికి రావడానికి కారణం అయిందని తెలుస్తోంది.
Tags
- khudiram bose
- khudiram bose biopic
- khudiram bose fasi
- khudiram bose story
- khudiram bise biopic
- khudiram bose biopic announced
- khudiram bose biography in hindi
- freedom fighter khudiram bose biopic
- khudiram bose movie
- khudiram
- essay on khudiram bose
- khudiram bose documentary
- khudiram bose biography
- who is khudiram bose
- khudiram bose essay
- khudiram bose in bangla
- khudiram bose freedom fighter
- freedom fighter khudiram bose
- khudiram bose bengali full movie
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com