రెమ్యునరేషన్‌తో పాటు హీరోయిన్లకు ఆ ఖర్చులు కూడా.. అందుకే నిర్మాతల ప్లాన్..

రెమ్యునరేషన్‌తో పాటు హీరోయిన్లకు ఆ ఖర్చులు కూడా.. అందుకే నిర్మాతల ప్లాన్..
సినీ పరిశ్రమలో హిట్స్ కొడుతూ.. డిమాండ్ పెరుగుతున్నకొద్దీ హీరోయిన్ల సౌకర్యాల విషయంలో కూడా కోరికలు ఎక్కువవుతూ ఉంటాయి.

సినీ పరిశ్రమలో హిట్స్ కొడుతూ.. డిమాండ్ పెరుగుతున్నకొద్దీ హీరోయిన్ల సౌకర్యాల విషయంలో కూడా కోరికలు ఎక్కువవుతూ ఉంటాయి. మామూలుగా హీరో అయినా హీరోయిన్ అయినా దాదాపు పది మంది పర్సనల్ స్టాఫ్‌ను మెయింటేయిన్ చేస్తారు. ఇప్పుడు వారే నిర్మాతలకు తలనొప్పిగా తయారయ్యారట. అందుకే వారికోసం నిర్మాతల కమిటీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం తెలుగులోని నిర్మాతలకు బడ్జెట్ సమస్యలు ఎదురవుతున్నాయి. చాలావరకు తాము తెరకెక్కిన చిత్రాలు హిట్ కొట్టి లాభాలు తెచ్చిపెడుతున్నా కూడా బడ్జెట్ భారం మాత్రం వారిపై పడక తప్పడం లేదు. ముందుగా సినిమాకు కొంత బడ్జెట్ అని ఒప్పుకున్న తర్వాత హీరోయిన్ల పర్సనల్ టీమ్స్ వల్ల ఆ బడ్జెట్ మరింత పెరిగిపోతుందని నిర్మాతలు అనుకుంటున్నారు.


హెయిర్ డ్రెస్సర్ నుండి స్టైలిస్ట్ వరకు దాదాపు పదిమందిని ఎప్పుడూ పక్కనే పెట్టుకుంటారు హీరోయిన్స్. అయితే కొంతకాలంగా వారు ఉంటున్న 5 స్టార్ హోటల్స్‌లోనే వారి స్టాఫ్‌కు కూడా రూమ్స్ బుక్ చేయాలని, విమానంలో కూడా తమతో పాటు బిజినెస్ క్లాస్ టికెట్స్ కేటాయించాలని హీరోయిన్స్.. నిర్మాతలను డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో బడ్జెట్ మరింత ఎక్కువవుతోంది.


అయితే ఇప్పటినుండి హీరోయిన్లకు రెమ్యునరేషన్ ఇంత ప్యాకేజ్ అని ఇచ్చేసి.. తమ మిగతా ఖర్చులన్నీ కూడా అందులోనే సర్దుబాటు చేసుకోవాలని చెప్పనున్నారట నిర్మాతలు. ఇలా చేయడం వల్ల తమపై భారం తగ్గుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. కానీ ముందుగా ఈ ఒప్పందానికి హీరోయిన్లు ఒప్పుకుంటారా లేదా అని వారు సందిగ్ధంలో పడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story