Producers Guild: నాని, నితిన్‌లను లెక్క చేయని "ప్రొడ్యూసర్స్ గిల్డ్"..?

Producers Guild: నాని, నితిన్‌లను లెక్క చేయని ప్రొడ్యూసర్స్ గిల్డ్..?
Producers Guild: నిర్మాత.. అంటే చిత్ర పరిశ్రమ అనే వృక్షానికి వేరు లాంటి వాడు. అతను లేకపోతే సినిమా పరిశ్రమ లేదు.

Producers Guild: నిర్మాత.. అంటే చిత్ర పరిశ్రమ అనే వృక్షానికి వేరు లాంటి వాడు. అతను లేకపోతే సినిమా పరిశ్రమ లేదు. అంటే వీళ్లు డబ్బును పెడుతూ.. చిత్ర నిర్మాణం ద్వారా దీన్ని ఒక పరిశ్రమగా విస్తరించారు. అయితే ఏ నిర్మాతా స్థిరం కాదు. వస్తుంటారు పోతుంటారు. ఎవరు వచ్చి పోయినా.. నిర్మాతల మండలి అనేది స్థిరం. ఇందులో నాటి, నేటి నిర్మాతలు భాగస్వాములుగా ఉంటారు. నిర్మాణానికి సంబంధించి ఏవైనా సమస్యలు వస్తే వీళ్లంతా కలిసి పరిష్కరించుకుంటారు. ఇంత వరకూ బానే ఉంది. కానీ కొందరిలో సరికొత్త అత్యాశ మొదలైంది.

అక్రమంగా సంపాదించాలనే ఆలోచన ఉన్నప్పుడు వక్రబుద్ధులు పుడతాయి కదా.. అలా పుట్టిందే ప్రొడ్యూసర్స్ గిల్డ్.. అలాగని వీరంతా అక్రమార్కులే అని చెప్పడం లేదు. ఎప్పుడో చిత్ర నిర్మాణం ఆపేసిన నిర్మాతలు కొందరు వక్రమార్గంలో సంపాదించాలనే ఆలోచన చేసి గతంలో ఎల్ఎల్పీ అని మరో సంస్థను స్థాపించారు. వీరు చిన్న, మీడియం రేంజ్ సినిమాలు చేసే ప్రొడ్యూసర్స్ ను కంట్రోల్ చేస్తూ.. వారి నుంచి కమీషన్స్ వసూలు చేశారు. అంటే సినిమాలే నిర్మించని ఒక నిర్మాత సినిమా నిర్మిస్తోన్న మరో నిర్మాతను దోచుకోవడం లాంటిదే ఇది.

ఈ కమీషన్స్ కోసం కొడాలి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పేరు మీద ఎల్ఎల్పీ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా చిన్న చిన్న నిర్మాతల నుంచి ఐదారు కోట్లు పైగా దోచుకున్నారు. ఆ దోచుకున్న డబ్బులతో హోండా కార్లు కొనుకున్నరు. ఎల్ఎల్పీ అయిపోగానే లేటెస్ట్ గా గిల్డ్ అని మొదలుపెట్టారు. గిల్డ్ లోని పెద్ద నిర్మాతల్లో చాలామందికి ఇప్పటి వరకూ వచ్చిన కమీషన్స్ గురించి ఏ అవగాహన లేదు. లేదంటే వారికి ఈ విషయాలేమీ ఇన్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ చెప్పడం లేదు. దీంతో ఆ కమీషన్ ఏం అవుతోందో ఎవరికీ తెలియడం లేదు.

ఇది పూర్తిగా సినిమాలు చేయని నిర్మాతలు, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ నుంచి దోచుకుని కార్లు, ఫ్లాట్లు కొనుక్కోవడానికి వేసిన స్కెచ్ లా ఉంది తప్ప.. నిర్మాతలకు ఎలాంటి ఉపయోగం లేదు. చిన్న సినిమాలు తీస్తూ చిన్న నిర్మాతలపై పెత్తనం చేస్తూ పెద్ద నిర్మాతలు కావాలనే కుట్రలో భాగంగానే గిల్డ్ లోని కొందరి ఎత్తుగడ కనిపిస్తోంది. ఈ కుట్రను గ్రహించే కొంతమంది యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి బయటకు రావాలనే ఆలోచనలో ఉన్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని, నితిన్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, నాగశౌర్య సినిమాలకు రెగ్యులర్ గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించే వెంకట్ ను ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి తొలగించారు.

ఇప్పటికే గిల్డ్ వ్యవహారాలపై గుర్రుగా ఉన్న చాలామంది నిర్మాతలు వెంకట్ పై చర్య తీసుకోవడంతో యూ టర్న్ తీసుకున్నారు. వారంతా గిల్డ్ వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే టైమ్ లో వెంకట్ గిల్డ్ వ్యవహారాలు చూసే సిఇఓకు ఫోన్ చేసి.. "మనం నడుపుతున్నది నిర్మాతల కంపెనీయా లేక బ్రో.. కంపెనీయా" అంటూ ఘాటుగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదే సందర్భంలో అనేక ప్రశ్నలు సంధించారు. కానీ వేటికీ వారి వద్ద సమాధానం లేదు. రాదు కూడా అంటున్నారు.

ఈ మొత్తం వ్యవహారాలు చూసిన తర్వాత గిల్డ్ నిర్మాతల్లో చీలికలు మొదలయ్యాయి. ఇప్పటికే చాలామంది నిర్మాతలు వెంకట్ కు మద్ధతుగా నిలుస్తూ.. గిల్డ్ నుంచే తప్పుకోవాలని చూస్తున్నారు. ఏదేమైనా సినిమా నిర్మాణం చేయకుండా గిల్డ్ లో పెత్తనం చెలాయిస్తూ.. అడ్డగోలు నిర్ణయాలతో పరిశ్రమ మనుగడను దెబ్బతీస్తోన్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే ఇప్పటికే వారి బారిన పడి నష్టపోయిన/ ఇబ్బంది పడిన చాలామంది నిర్మాతలు వాపోతున్నారు. ఫైనల్ గా ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

-Y.J.R

Tags

Read MoreRead Less
Next Story