MAA Association: "మా"తో ముగిసిన గిల్డ్ మీటింగ్.. ఏం చర్చించారంటే..?

MAA Association: మాతో ముగిసిన గిల్డ్ మీటింగ్.. ఏం చర్చించారంటే..?
MAA Association: ఇక మీటింగ్ పూర్తయ్యే సమయానికి అందరూ కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

MAA Association: ఇటీవల తెలుగు సినిమా షూటింగ్స్ విషయంలో చాలా చర్చలే నడుస్తున్నాయి. ఇక తాజాగా వాటి గురించి చర్చించడం కోసమే ప్రొడ్యూసర్స్ గిల్డ్‌తో 'మా' సమావేశమయ్యింది. ఈ మీటింగ్‌కు 'మా' తరపున అధ్యక్షుడు మంచు విష్ణు, రఘుబాబు, శివబాలాజీ, జీవిత రాజేఖర్ హాజరయ్యాయి. ఇక ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుండి దిల్ రాజు, మైత్రి నవీన్, సితార నాగ వంశీ, శరత్ మరార్, బాపినీడు, వివేక్ హాజరయ్యారు.

ఇక మీటింగ్ పూర్తయ్యే సమయానికి అందరూ కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలుగు సినిమా షూటింగ్స్‌లో కచ్చితంగా 'మా' సభ్యులను తీసుకోవాలని కమిటీ తెలిపింది. ఒకవేళ అలా కుదరకపోతే.. ఇతర భాషా నటులను తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే.. వారిని 'మా' అసోసియేషన్‌లో చేర్చాలని తెలిపింది.

'మా' సభ్యుల సినిమా క్యాస్టింగ్ క్లియర్‌గా ఉండడం కోసం 'మా'లోని సీనియర్ సభ్యులుగా ఉన్న ఆర్టిస్టులు వివరాలను గిల్డ్‌కు అందించారు మంచు విష్ణు. ఇక గిల్డ్ సభ్యులు కూడా వారి సమస్యలను 'మా'తో చర్చించారు. ఇకపై ఎలాంటి విభేధాలు రాకుండా కలిసి సమన్వయంతో ముందుకెళ్లాలని గిల్డ్‌తో కలిసి 'మా' నిర్ణయించింది.

Tags

Read MoreRead Less
Next Story