పున్నూ ఎంగేజ్‌మెంట్‌.. రాహుల్ సిప్లిగంజ్..!!

పున్నూ ఎంగేజ్‌మెంట్‌.. రాహుల్ సిప్లిగంజ్..!!
'చివరకు ఇది జరుగుతుంది'

అంతకు ముందు ఎవరి జీవితాలు వారివి.. బిగ్‌బాస్ హౌస్ వాళ్లిద్దర్నీ దగ్గర చేసింది. ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది అని అభిమానుల్లో ఆసక్తి కలిగించింది.. బయటకు వచ్చాక ఇద్ధరూ కలిసి పలు ఇంటర్వ్యూల్లో పాల్గొనడం.. మా మధ్య ఏమీ లేదు అని చెప్పడం జరిగింది.. రాహుల్ సిప్లిగంజ్ తల్లిదండ్రులైతే పునర్నవి భూపాలానికి ఇష్టమైతే పెళ్లి చేస్తామని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయినా అమ్మడు ఏమీ మాట్లాడలేదు.. కనీసం ఆ టాపిక్‌పై స్పందించను కూడా లేదు.. కానీ సడన్‌గా ఇప్పుడు మరో సర్‌ప్రైజ్ న్యూస్‌తో వార్తల్లోకి వచ్చింది.

'చివరకు ఇది జరుగుతుంది' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన చేయి మరొకరి చేతిలో ఉంచిన ఫోటోని పోస్ట్ చేసింది. వేలికి డైమండ్ రింగ్ ధరించి ఉంది. దాంతో అభిమానులకు పున్నూకి ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని ఫిక్సయిపోతున్నారు.. ఇంతకీ పున్నూ చేయి అందుకున్న ఆ అదృష్టవంతుడెవరు అని ఆసక్తి కనబరుస్తున్నారు. పున్నూ, రాహుల్ మధ్య బిగ్‌బాస్ హౌస్‌లో జరిగిన ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌ని గుర్తుకు తెచ్చుకుని అతడేనేమో ఆమె చేతికి రింగ్ తొడిగిన వ్యక్తి అని ఊహించుకుంటున్నారు. ఈ సస్పెన్స్‌కు తెర దించాలంటే పునర్నవి మరో ఫోటో పోస్ట్ చేయాలి.. తన చేయందుకున్న చెలికాడు ఇతడే అని.. అంతవరకు అభిమానులు ఆగాల్సిందే.

View this post on Instagram

Finally! It's happening 🥰❤️

A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) on

Tags

Next Story