Puri Jagannadh: 'లైగర్' మూవీ కాపీ అన్న ప్రేక్షకులు.. స్పందించిన పూరీ..

Puri Jagannadh: మామూలుగా దర్శకులు ఒక కథను సిద్ధం చేయాలంటే కాస్త ఎక్కువ సమయమే తీసుకుంటారు. కానీ పూరీ జగన్నాధ్ అలా కాదు. ఇప్పటికీ పూరీ తెరకెక్కించని సినిమా కథలు ఆయన దగ్గర ఉన్నాయి. దాదాపు రెండు వారాల్లో కథను డైలాగులతో సహా పూర్తి చేసేస్తానని పూరీ ఇదివరకే చెప్పారు. అయితే విజయ్‌తో తాను తెరకెక్కిస్తున్న లైగర్ సినిమా కూడా ఇదివరకు పూరీ చేసిన సినిమా నుండి కాపీ అని ప్రేక్షకులు ట్రోల్ చేస్తున్నారు. వీటిపై పూరీ జగన్నాధ్ స్పందించాడు.
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్ కలిసి చేస్తున్న చిత్రమే 'లైగర్'. ఇందులో బాక్సర్ పాత్రలో రౌడీ హీరో అలరించనున్నాడు. పూర్తిస్థాయి బాక్సర్‌గా కనిపించడం కోసం విజయ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అయితే లైగర్ కథను చూస్తుంటే ఇంతకు ముందు పూరీ తెరకెక్కించిన 'అమ్మా, నాన్న, ఓ తమిళమ్మాయి'లాగానే ఉందని భావిస్తున్నారు ప్రేక్షకులు. అందులో జయసుధ, రవితేజ లాగా ఇందులో రమ్యకృష్ణ, విజయ్ అని అంటున్నారు. అంతే కాకుండా ఈ రెండు చిత్రాలు బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కినవే.
పూరీ జగన్నాధ్ ఈ అంశంపై మాట్లాడుతూ.. లైగర్ పూర్తిగా కొత్త చిత్రమని అన్నారు. తన ముందు సినిమాల రిఫరెన్స్ ఏమీ ఇందులో ఉండదని అన్నారు. లైగర్ పూర్తిగా స్పోర్ట్స్ డ్రామా కాదని, ఒక పక్కా కమర్షియల్ సినిమా అని క్లారిటీ ఇచ్చారు. పైగా ఇందులో మంచి లవ్ స్టోరీ కూడా ఉందని బయటపెట్టారు. లైగర్‌లో విజయ్ దేవరకొండకు జోడీగా బాలీవుడ్ భామ అనన్య పాండే నటించింది. ఇక ఈ మూవీ ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com