Puri Jagannadh: బండ్ల గణేష్ వ్యాఖ్యలకు పూరీ కౌంటర్.. చీప్‌గా వాగొద్దంటూ..

Puri Jagannadh: ఆకాష్ పూరీ హీరోగా నటించిన 'చోర్ బజార్' చిత్రం గత శుక్రవారం థియేటర్లలో విడుదలయ్యి మంచి టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఆకాష్ తండ్రి పూరీ జగన్నాధ్.. సొంత కొడుకు సినిమా ఈవెంట్‌కు రాకపోవడమేంటి అని ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు. దీనికి ఇటీవల పూరీ జగన్నాధ్ స్పందించాడు.
'పూరీ ఎంతో మందిని స్టార్స్ చేశాడు.. కానీ కొడుకు సినిమా ఫంక్షన్ కి మాత్రం రాకుండా ఎక్కడో ముంబాయిలో ఉన్నాడు.. ఇదేం బాలేదు.. ఇలా చేయకూడదు అన్నా' అని పూరీని ఉద్దేశించి అన్నారు బండ్ల గణేష్. 'అన్నా ఇంకోసారి ఇలా చేయకు నీకు దణ్ణం పెడతా.. నీ కొడుకుని స్టార్‌ను చేయకుండా ముంబాయిలో ఉంటే మేం ఒప్పుకోం.. నువ్వు ఆకాశ్ ని స్టార్ ని చేసినా చేయకున్నా స్టార్ అవుతాడు.. నీ కొడుకు డేట్స్ కోసం నువ్వు క్యూలో నిలబడే రోజు తప్పకుండా వస్తుంది' అని బండ్ల గణేశ్ మాట్లాడారు.
తాజాగా ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. పూరీ జగన్నాధ్ ఈవెంట్‌కు రాకపోవడం వల్ల బండ్ల గణేష్ నేరుగా ఇలా మాట్లాడతాడని ఎవరూ ఊహించలేదు. అందుకే పూరీ దీనికి తగిన కౌంటర్ ఇచ్చారు. 'ఫ్యామిలీ మెంబర్స్ కావొచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ కావొచ్చు.. ఆఫీస్ లో ఎంప్లాయ్స్ కావొచ్చు.. ఆఖరికి కట్టుకున్న భార్య దగ్గర కూడా ఆచితూచి మాట్లాడండి' అని పూరీ సూచించారు. 'చీప్‌గా వాగొద్దు.. చీప్‌గా ప్రవర్తించొద్దు' అని ఇన్‌డైరెక్ట్ కౌంటర్ ఇచ్చారు పూరీ. ఇదంతా పూరీ.. తన మ్యూజింగ్స్‌లో తెలిపాడు. ఇందులో ఎక్కడా బండ్ల గణేష్ పేరు ఉపయోగించకపోయినా.. ఇదంతా తనకే కౌంటర్ అని వినేవారికి స్పష్టంగా అర్థమవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com