Puri Jagannadh: 'అలాంటి ఆకర్షణ ఎక్కువ రోజులు ఉండదు'.. ఛార్మీతో సాన్నిహిత్యంపై పూరీ

Puri Jagannadh: అలాంటి ఆకర్షణ ఎక్కువ రోజులు ఉండదు.. ఛార్మీతో సాన్నిహిత్యంపై పూరీ
Puri Jagannadh: దర్శకుడు పూరీ జగన్నాధ్, ఛార్మీ మధ్య ఉన్న సంబంధం గురించి ఎప్పటినుండో వార్తలు వస్తూనే ఉన్నాయి.

Puri Jagannadh: దర్శకుడు పూరీ జగన్నాధ్, ఛార్మీ మధ్య ఉన్న సంబంధం గురించి ఎప్పటినుండో వార్తలు వస్తూనే ఉన్నాయి. ముందుగా పూరీ, ఛార్మీ మధ్య సాన్నిహిత్యాన్ని చూసి ప్రేక్షకులు సైతం వీరిద్దరి మధ్య ఏదో ఉందని అనుకోవడం మొదలుపెట్టారు. దానికి వీరిద్దరూ ఎప్పుడూ పెద్దగా స్పందించలేదు. ఓవైపు ఛార్మీకి వివాహం కాలేదు. మరోవైపు పూరీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులోనూ కొడుకు ఇప్పుడు హీరోగా కూడా మారాడు. తాజాగా ఈ రూమర్స్‌పై నోరువిప్పాడు పూరీ.

తాజాగా లైగర్ ప్రమోషన్స్‌లో స్టేజ్‌పైనే పూరీ.. ఛార్మీకి ఐ లవ్యూ చెప్పడం సంచలనంగా మారింది. తనకు ఛార్మీ ఎంత సపోర్టింగ్‌గా ఉంటుందో చెప్తూ ఈ పనిచేశాడు పూరీ. ఇది వీరిపై వస్తున్న రూమర్స్‌ను మరింత పెద్దిది చేసింది. దీంతో మొదటిసారి దీనిపై పూరీ జగన్నాధ్ స్పందించాడు. ఇన్ని సంవత్సరాలు నుండి ఈ రూమర్స్‌పై స్పందించినవారు సడెన్‌గా స్పందించడం కూడా ఆశ్చర్యంగానే ఉంది అనుకుంటున్నారు ప్రేక్షకులు.

'తను ఒక 50 ఏళ్ల మహిళ అయితే ప్రేక్షకులు ఈ విషయాల గురించి పట్టించుకోరు. తనకు వేరేవారితో పెళ్లి జరిగుంటే పట్టించుకోరు. ఛార్మీ ఇంకా యంగ్‌గా ఉండడం వల్ల ప్రేక్షకులు ఎఫైర్ అదీ, ఇదీ అని అనుకుంటున్నారు. ఒకవేళ ఎఫైర్ ఉన్నా ఎన్నిరోజులు ఉంటుంది. ఏ జంటకు అయినా రొమాంటిక్ యాంగిల్‌కు వచ్చేసరికి ఆకర్షణ అనేది కొన్నిరోజుల్లోనే చచ్చిపోతుంది. అందరికీ పెళ్లయ్యింది. అందరికీ ఈ విషయం తెలుసు. ఫ్రెండ్‌షిప్ మాత్రమే శాశ్వతం. నాకు ఛార్మీ 13 ఏళ్ల వయసప్పటి నుండి తెలుసు. దాదాపు రెండు దశాబ్దాలుగా తనతో నేను కలిసి పనిచేస్తున్నాను' అని రూమర్స్‌కు చెక్ పెట్టాడు పూరీ జగన్నాధ్.

Tags

Read MoreRead Less
Next Story