24 Aug 2022 4:40 AM GMT

Home
 / 
సినిమా / టాలీవుడ్ / Puri Jagannadh: 'గాడ్...

Puri Jagannadh: 'గాడ్ ఫాదర్'లో నా పాత్ర అదే: పూరీ జగన్నాధ్

Puri Jagannadh: పూరీ జగన్నాధ్ తలచుకుంటే మూడు నెలల్లో సినిమా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలడు.

Puri Jagannadh: గాడ్ ఫాదర్లో నా పాత్ర అదే: పూరీ జగన్నాధ్
X

Puri Jagannadh: ఈమధ్య డైరెక్టర్లు యాక్టర్లుగా మారడం ట్రెండ్ అయిపోయింది. ఇప్పటికే చాలామంది యంగ్ దర్శకులు.. కొన్నాళ్లు డైరెక్షన్‌ను పక్కన పెట్టి మరీ.. యాక్టింగ్‌లో దూసుకెళ్తున్నారు. ఇదిలా ఉండగా ఒకప్పుడు సీనియర్ దర్శకులు కూడా గెస్ట్ రోల్స్‌తో మెప్పించిన వారు ఉన్నారు. తాజాగా డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కూడా మెగాస్టార్ సినిమాలో మెరవడానికి సిద్ధమవుతున్నాడు.

పూరీ జగన్నాధ్ తలచుకుంటే మూడు నెలల్లో సినిమా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలడు. కానీ దాదాపు రెండున్నరేళ్లుగా 'లైగర్' చిత్రంపైనే పూరీ ఫోకస్ ఉంది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా తెరకెక్కిన లైగర్.. పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న మూవీ టీమ్.. పలు ఆసక్తికర విషయాలను బయటపెడుతున్నారు.

ఇప్పటివరకు పూరీ జగన్నాధ్ పలు చిత్రాల్లో స్క్రీన్‌పై మెరిశాడు. అది కూడా దాదాపు తను డైరెక్ట్ చేసిన చిత్రాల్లోనే. అవి మాత్రమే కాకుండా 'ఏమాయ చేశావే'లో డైరెక్టర్ పాత్రలోనే మెప్పించాడు. ఆ తర్వాత ఎప్పుడూ వేరేవారి దర్శకత్వంలో పూరీ నటించలేదు. చాలాకాలం తర్వాత చిరంజీవి నటిస్తున్న 'గాడ్ ఫాదర్'లో ఓ కీలక పాత్ర చేస్తున్నట్టు ప్రకటించింది మూవీ టీమ్. అయితే ఈ సినిమాలో తానొక జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నట్టు ఇటీవల పూరీ బయటపెట్టారు.

పూరీ జగన్నాధ్, చిరంజీవి కలిసి ఇప్పటికే ఓ సినిమా చేయాల్సి ఉంది. అసలైతే చిరు 150వ చిత్రానికి పూరీనే దర్శకుడు అని కూడా అప్పట్లో ప్రకటించాడు. కానీ పలు మనస్పర్థల కారణంగా డైరెక్టర్ మారిపోయాడు. అప్పటినుండి చిరంజీవిని డైరెక్ట్ చేయడం తన కల అని, ఇప్పటికే ఓ కథ కూడా వినిపించానని ఇటీవల బయటపెట్టాడు పూరీ. అయితే ఆ కథ చిరంజీవికి నచ్చకపోవడంతో మరో కథ కూడా రాస్తున్నట్టు తెలిపాడు.

Next Story