ఎదుటి వారికి సలహాలు ఇచ్చే ముందు.. పూరీ జగన్నాథ్

ఏదైనా పని చేసేటప్పుడు స్పృహతో ఉండడం ఎంతైనా అవసరం. ఎవరూ గమనించట్లేదనుకుంటాము కానీ ఎన్నో కళ్లు మనల్ని చూస్తుంటాయి.. మన మూమెంట్స్‌ని, మన మూడ్స్‌ని గమనించుకుంటూ, మన ఎమోషన్స్‌ని కంట్రోల్‌లో ఉంచుకుంటూ ముందుకెళ్తే గుడ్ లీడర్ అవుతారు అని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వివరించారు. వాస్తవితకు దగ్గరగా ఉండే ఆలోచనల్ని పూరీ మ్యూజింగ్స్ ద్వారా వివరించారు. ఎమోషనల్ ఇంటిలిజెన్స్ టాపిక్‌పై ఓ ఆడియో రిలీజ్ చేశారు.
ఇందులో పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ..ఐక్యూ చాలా మందికి ఉంటుంది. ఈక్యూ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈక్యూ అంటే ఎమోషనల్ కోషెంట్.. దీనినే ఎమోషనల్ ఇంటిలిజెన్స్ అంటారు. ఇది ఉన్నవాళ్లు గుడ్ లీడర్స్ అవుతారు. ఇందులో నాలుగు ఉంటాయి. సెల్ఫ్ అవేర్‌నెస్, సెల్ఫ్ మ్యానేజ్‌మెంట్, సోషల్ అవేర్‌నెస్, రిలేషన్‌షిప్ మ్యానేజ్‌మెంట్. ఈ నాలుగూ దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మన ఎమోషన్స్, ఫీలింగ్స్, వీక్‌నెస్.. ఇవన్నీ తెలియకుండా మనల్ని డ్రైవ్ చేస్తుంటాయ్. అందుకే మనల్నిమనం అబ్జర్వ్ చేసుకోవాలి.
హౌ యూ రియాక్ట్ పీపుల్ అనేది చాలా ఇంపార్టెంట్.. వాళ్లని ఎలా పలకరిస్తున్నావ్.. ఎలా మాట్లాడుతున్నావ్.. చెక్ చేసుకోవాలి. వాళ్లతో మనం మాట్లాడే విధానం ఎలా ఉందో గమనించాలి. అలాగే ఒత్తిడి పరిస్థితుల్లో మనం ఎలా ప్రవర్తిస్తున్నామనేది కూడా చాలా ఇంపార్టెంట్.. డిప్రెస్ అవుతున్నామా.. గట్టిగా అరుస్తున్నామా.. లేదా గట్టిగా ఏడుస్తున్నామా అనేది నువ్వు గమనించుకోకపోయినా నీ చుట్టూ ఉన్నవాళ్లు నిన్ను అబ్జర్వ్ చేస్తుంటారు.
అందుకే మనం ఏంటో మనకి తెలియాలి. సమస్య వచ్చినప్పుడు దానిని నువు డీల్ చేసే విధానాన్ని బట్టి అందరూ నిన్ను అంచనా వేస్తారు. పని చేసే చోట కామ్‌గా ఉండడం, అవతలి వాళ్లు చెప్పేది వినడం అనేది చాలా అవసరం. ఏదైనా తప్పు చేస్తే దాన్నుంచి తప్పించుకోవాలని చూడొద్దు. ఆ బాధ్యతను మీరే తీసుకోండి.
మనలో ఉన్న ఎమోషన్స్‌ని తగ్గించుకోవాలి. ఎంత గుడ్ న్యూస్ విన్నా డాన్సులు చేయడం, అరవడం లాంటివి చేయకూడదు. బ్యాలెన్స్ మైండ్‌ని అందరూ నమ్ముతారు. వాళ్లనే సలహా అడుగుతారు. స్నేహితులకు గానీ, బంధువులు గానీ సలహాలు, సూచనలు ఇవ్వాలంటే ముందు మనల్ని మనం అర్థం చేసుకోవాలి. అందరి జీవితంలో ఎమోషనల్ ఇంటిలిజెన్స్ అనేది చాలా ముఖ్యం అని అన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com