Pushpa 2: 'పుష్ప' పార్ట్ 2 నుండి క్రేజీ అప్డేట్..

Pushpa 2: పుష్ప పార్ట్ 2 నుండి క్రేజీ అప్డేట్..
Pushpa 2: పుష్ప పార్ట్ 2పైనే సుకుమార్, అల్లు అర్జున్ ఫోకస్ ఉంది.

Pushpa 2: 'పుష్ప' సినిమా గురించి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. సినిమా విడుదలవ్వగానే నెగిటివ్ టాక్‌తో మొదలయినా పుష్ప కలెక్షన్స్‌తో పాటు మెల్లగా వరల్డ్ వైడ్ క్రేజ్‌ను సంపాదించుకుంది. క్రికెట్ గ్రౌండ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో.. ఇలా ప్రతీ చోట పుష్ప క్రేజ్ ఇప్పటికీ కొనసాగుతోంది. దీంతో మూవీ టీమ్ కూడా ప్రేక్షకులను ఎక్కువగా వెయిట్ చేయించకుండా పార్ట్ 2 గురించి ఓ సూపర్ అప్డేట్ రిలీజ్ చేసింది.

పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అవ్వడంతో పుష్ప పార్ట్ 2పై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. ఈ అంచనాలు అందుకోవడం కోసం దర్శకుడు సుకుమార్ చాలా కష్టపడుతున్నాడు. ఇంతకు ముందు రాసుకున్న కథను చెరిపేసి కొత్తగా రాసుకున్నాడు. స్టోరీ సిట్టింగ్స్‌కు తొందర పడకుండా చాలా సమయం తీసుకున్నాడు. దీంతో ఈ మూవీ కథ ఓ రూపం దాల్చింది.

పుష్ప పార్ట్ 2పైనే సుకుమార్, అల్లు అర్జున్ ఫోకస్ ఉంది. అందుకే వీరి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా దీనిపైనే దృష్టి పెట్టారు. అయితే కథ పూర్తి కావడంతో పుష్ప పార్ట్ 2 షూటింగ్ రేపు (సోమవారం) పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని మూవీ టీమ్ అప్డేట్ ఇచ్చింది. ఇక పార్ట్ 1లో ఉన్న నటీనటులతో పాటు పార్ట్ 2లో మరికొందరు క్రేజీ యాక్టర్స్‌ను సుకుమార్ జాయిన్ చేయనున్నట్టు సమాచారం.



Tags

Next Story