Pushpa Movie: 'పుష్ప'కు పార్ట్ 3 ఉండనుంది.. బయటపెట్టిన హీరో..

Pushpa Movie: పాన్ ఇండియా మూవీ అనే ట్యాగ్‌కు ఎంతో ప్రత్యేకత తెచ్చిపెట్టింది. ఇక ఈ పాన్ ఇండియా సినిమాల ట్రెండ్‌కు కొత్త ఊపునిచ్చింది 'పుష్ప' మూవీ. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప.. ముందుగా మిక్స్‌డ్ టాక్‌తో మొదలయినా ఆ తర్వాత కలెక్షన్ల విషయంలో రికార్డులను తిరగరాసింది. ఇప్పటికే పుష్ప పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మరో గుడ్ న్యూస్ చెప్పాడు హీరో ఫాహద్ ఫాజిల్.
మలయాళంలో వెర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఫాహద్ ఫాజిల్.. పుష్ప చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్‌గా కనిపించి అలరించారు. పుష్ప పార్ట్ 1లో ఫాహద్ కనిపించేది కాసేపే అయినా.. పార్ట్ 2లో మాత్రం తనకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుందని సుకుమార్ ఇప్పటికే బయటపెట్టాడు. అయితే పుష్ప అప్డేట్స్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు ఫాహద్.
ప్రస్తుతం మలయాళంలో పలు సినిమాలతో బిజీగా ఉన్న ఫాహద్.. ఇటీవల తమిళంలో కమల్ హాసన్‌తో కలిసి నటించిన 'విక్రమ్' సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ కమిట్మెంట్స్‌తో బిజీగా ఉన్న ఫాహద్‌ను.. ఇటీవల సుకుమార్ కలిసి పుష్ప పార్ట్ 2 స్టోరీని వివరించాడట. ఆ సందర్భంలో పుష్పకు పార్ట్ 3 కూడా ఉండే అవకాశం ఉందని సుకుమారం తనతో చెప్పినట్టు ఫాహద్ స్పష్టం చేశారు. ఇది విన్న బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com