ఆర్. నారాయణమూర్తి 'యూనివర్శిటీ'

ఆర్. నారాయణమూర్తి యూనివర్శిటీ
X
ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం

పరీక్ష పేపర్ల లీకేజీ దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోన్న నేపథ్యంలో ప్రముఖ విప్లవాత్మక దర్శక-రచయిత ఆర్ నారాయణ మూర్తి మరో పదునైన చిత్రంతో ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. యూనివర్శిటీ పేరిట ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 9న విడుదలకు సిద్దమవుతోంది. స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో పీపుల్స్ స్టార్ గా పేరుగాంచిన ఆర్ నారాయణ మూర్తి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూన్ 9న రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నారాయణ మూర్తి మాట్లాడుతూ: '10వ తరగతిలో పేపరు లీకేజీలు - గ్రూపు 1-2 లాంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరులీకేజీలు ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి ? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి ? లంబకోణాలు నేర్పిన వాళ్ళే కుంభకోణాలు జేస్తూ ఉంటుంటే రెక్కలు తెగిన జ్ఞాన పావురాలు విలవిల కోట్టుకుంటూ ఊపిరాడక గింజు కుంటుంటే ఈ విద్యావ్యవస్థ, ఈ ఉద్యోగవ్యవస్థ నిర్వీర్యం కావాలా? కాకూడదు. మనది నిరుద్యోగ భారతం కాదు. ఉద్యోగ భారతం కావాలి అని చాటి చెప్పే చిత్రమే ఈ “యూనివర్సిటీ” అంటూ తనదైన శైలిలో స్పందించారు.

Tags

Next Story