Raashi Khanna: డేటింగ్ కోరికను బయటపెట్టిన రాశీ.. స్పందించిన నాగచైతన్య..

Raashi Khanna: మామూలుగా పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను పెద్దగా బయటపెట్టడానికి ఇష్టపడరు సినీ సెలబ్రిటీలు. ముఖ్యంగా హీరోయిన్లు.. వారి పర్సనల్ విషయాలను అస్సలు షేర్ చేసుకోరు. కానీ రాశీ ఖన్నా మాత్రం తన అప్‌కమింగ్ మూవీ ప్రమోషన్స్‌లో పర్సనల్ విషయాలతో పాటు తన మనసులోని కోరికలు కూడా బయటపెట్టేస్తోంది. ఇటీవల తాను ఎలాంటి వ్యక్తితో డేటింగ్ చేయాలనుకుంటుందో చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.
రాశీ ఖన్నా, గోపీచంద్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పక్కా కమర్షియల్' మూవీ జులై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది డీసెంట్ హిట్‌ను అందుకుంది. ఇందులో ఓ కామెడీ లాయర్ పాత్రలో రాశీ నటన అందరినీ ఇంప్రెస్ చేసింది. ఇక ఈ సినిమా విడుదలయ్యి నెలరోజులు అవ్వకముందే నాగచైతన్యతో చేసిన 'థాంక్యూ' చిత్రంతో మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది రాశీ. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న తాను ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
రాశీ ఖన్నాకు డాక్టర్‌తో డేటింగ్ చేయాలనుందట. అయితే ఇప్పటికే తాను సింగిల్ అని, రెడీ టు మింగిల్ అని చాలాసార్లు హింట్ ఇచ్చిన రాశీ.. తనకు ఓ డాక్టర్‌తో డేట్‌కు వెళ్లాలని ఉందన్న కోరికను బయటపెట్టింది. అదే సమయంలో తన పక్కనే ఉన్న నాగచైతన్య దీనిపై స్పందించాడు. డాక్టర్లందరూ ఇది విన్నారా అని అడిగాడు. డాక్టర్స్ అంతా ఆసుపత్రి వెళ్లడం మానేసి రాశీ ఖన్నా ఇంటి బయట కాపు కాస్తారేమో అంటూ ఆటపట్టించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com