Raashi Khanna: నేను హీరోయిన్ కాదు కమెడియన్: రాశీ ఖన్నా

Raashi Khanna: సినిమాల్లో హీరోలు కామెడీ చేయడం ఇప్పటికీ ప్రేక్షకులు చాలాసార్లు చూశారు. కానీ హీరోయిన్లు కామెడీ చేయడం అనేది చాలా అరుదు. అది కూడా అలాంటి క్యారెక్టర్ దొరికినప్పుడు నటించి ప్రేక్షకులను మెప్పించడం మరింత కష్టం. కానీ రాశి ఖన్నా మాత్రం అలాంటి పాత్రలు ఈజీగా చేసేస్తుంది. దీనిపై ఇటీవల పక్కా కమర్షియల్ ట్రైలర్ లాంచ్‌లో ఆసక్తికర కామెంట్స్ చేసింది రాశీ ఖన్నా.
'ఊహలు గుసగుసలాడే' లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా. ఆ తర్వాత ఒకే రకమైన పాత్రలకు ఫిక్స్ అయిపోకుండా ఎన్నో వైవిధ్యభరితమైన క్యారెక్టర్స్ చేసింది రాశీ. అదే క్రమంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సుప్రీం' చిత్రంలో ఓ కామెడీ పోలీస్ ఆఫీసర్‌గా నటించి తన నటనతో అందరినీ నవ్వించింది. ఇప్పుడు మరోసారి అలాంటి పాత్రలోనే కనిపించనుంది రాశీ.
ప్రస్తుతం రాశీ ఖన్నా.. గోపీచంద్‌తో కలిసి 'పక్కా కమర్షియల్' అనే చిత్రంలో నటిస్తోంది. ఆదివారం గోపీచంద్ పుట్టనరోజు సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కూడా రాశీ ఓ కామెడీ లాయర్ పాత్రలో నటించింది. అందుకే పక్కా కమర్షియల్ చిత్రంలో తాను హీరోయిన్ కాదు కమెడియన్ అంటూ వ్యాఖ్యలు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com